Gold Rates: ఈ రోజు గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold Price: హైదరాబాద్‌లో బంగారం ధర 99.9శాతం(24 కేరెట్ల) రూ.39,460.27గా ఉంది. అదే, 22 కేరెట్ల బంగారం ధర రూ.36895.35గా ఉంది. వెండి కిలో ధర రూ.49,160గా కొనసాగుతూ రూ.50వేల వైపు పరుగులు తీస్తోంది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 30, 2019, 11:55 AM IST
Gold Rates: ఈ రోజు గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయంటే..
ప్రతీకాత్మక చిత్రం
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 30, 2019, 11:55 AM IST
బంగారం ధర రోజు రోజుకు రికార్డులు సృష్టిస్తోంది. నిన్న బంగారం రూ.40వేల మార్కును దాటిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో బంగారం ధర 99.9శాతం(24 కేరెట్ల) రూ.39,460.27గా ఉంది. అదే, 22 కేరెట్ల బంగారం ధర రూ.36895.35గా ఉంది. వెండి కిలో ధర రూ.49,160గా కొనసాగుతూ రూ.50వేల వైపు పరుగులు తీస్తోంది. ఇక మార్కెట్‌లో 100 వెండి నాణేల ధర రూ.3,000 ధర పెరిగింది. 100 వెండి నాణేల కొనుగోలు ధర రూ.₹1,01,000 కాగా అమ్మకం ధర రూ.₹1,02,000. అంతర్జాతీయ దేశాలపై ఆర్థిక మాంద్యం కోరలు చాచుతుండటం, అమెరికా-చైనా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్యంపై జరుగుతున్న చర్చలు కొలిక్కిరాకపోవడంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్‌మెంట్లను సురక్షితమైన బంగారం వైపు మళ్లించడంతో గత నెల రోజులుగా ధరలు పెరుగుతున్నాయి.

అంతేకాకుండా, వచ్చేది పండుగ సీజన్‌ కావడంతో ఆభరణాల వ్యాపారులు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో ధరలు అంతకంతకు పెరుగుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక, అమెరికా, జర్మనీ దేశాల ఆర్థిక పరిస్థితులు నిరాశాజనకంగా ఉండటంతో గ్లోబల్‌ మార్కెట్లో పసిడి ధరలు అంతంత మాత్రంగానే ఉన్నాయని వెల్లడిస్తున్నారు.

First published: August 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...