GOLD PRICE TODAY GOLD SILVER RATE KNOW WHAT IS THE PRICE OF GOLD TODAY JAN 18 MK
Gold Price: రికార్డు స్థాయిలో పడిపోయిన బంగారం ధర, తులం బంగారం రూ.48 వేల దిగువనే, ఇప్పుడు బంగారం కొనొచ్చా...తెలుసుకోండి.
(ప్రతీకాత్మక చిత్రం)
దేశీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. మునుపటి సెషన్‌తో పోల్చి చూస్తూ బంగారం ధర స్వల్పంగా పెరిగినప్పటికీ, ఓవరాల్ గా చూస్తే పసిడి ధరలు గరిష్ట స్థాయి నుంచి భారీగా పతనం అయ్యాయి. అటు మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో జనవరి 18న 10 గ్రాముల బంగారం ఫ్యూచర్స్ 0.05 శాతం తగ్గి రూ. 47,892కి చేరుకుంది.
దేశీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. మునుపటి సెషన్‌తో పోల్చి చూస్తూ బంగారం ధర స్వల్పంగా పెరిగినప్పటికీ, ఓవరాల్ గా చూస్తే పసిడి ధరలు గరిష్ట స్థాయి నుంచి భారీగా పతనం అయ్యాయి. అటు మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో జనవరి 18న 10 గ్రాముల బంగారం ఫ్యూచర్స్ 0.05 శాతం తగ్గి రూ. 47,892కి చేరుకుంది. అటు అంతర్జాతీయ మార్కెట్లో మంగళవారం బంగారం ధర స్థిరంగా ఉంది. స్పాట్ బంగారం ధరలు ఔన్సుకు 1,818.87 డాలర్లుగా నమోదైంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.1 శాతం పెరిగి 1,818.50 డాలర్లకు చేరుకుంది. US 10-సంవత్సరాల ట్రెజరీ ఈల్డ్‌లు గురువారం పెరిగాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు మార్చిలో వడ్డీ రేట్లను పెంచుతామని పాలసీ రూపకర్తలు సంకేతాలు ఇవ్వడంతో జనవరి 25-26 తేదీల్లో జరగనున్న US ఫెడరల్ రిజర్వ్ సమావేశంపైనే ప్రస్తుతం అందరి దృష్టి కేంద్రీకృతమైంది.
మరోవైపు అంతర్జాతీయ గోల్డ్ స్పాట్ , ఫ్యూచర్స్ మంగళవారం ఉదయం ఆసియా మార్కెట్లో స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. స్పాట్ గోల్డ్ 1820 స్థాయిల కంటే ఎక్కువ ట్రేడింగ్ చేస్తే, అది 1833-1846 డాలర్ల స్థాయిల వరకు బుల్లిష్ మొమెంటంను చూడవచ్చు. దిగువన ఉన్న ట్రేడింగ్ ధరలను 1814-1802 స్థాయిల వద్ద మద్దతు జోన్‌కు తిరిగి తీసుకురాగలదు" అని రిలయన్స్ సెక్యూరిటీస్‌లోని సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ శ్రీరామ్ అయ్యర్ అన్నారు.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.