బంగారం ధరలు పెరుగుదల మార్గం పట్టాయి. పసిడి మార్కెట్లో బుల్లిష్ ధోరణి కొనసాగుతోంది. ముఖ్యంగా ఒమిక్రాన్ నేపథ్యంలో పసిడి మార్కెట్లు జోరందుకున్నాయి. దీంతో నేడు కూడా బంగారం, వెండి ధరల్లో జంప్ కనిపించింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో బంగారం ధరలు రూ.66 పెరగగా, వెండి కూడా కిలోకు రూ.99 పెరిగి ట్రేడింగ్‌లో కనిపించింది. MCXలో ఫిబ్రవరిలో ఫ్యూచర్ డీల్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.66 పెరిగి రూ.47,844కి చేరుకుంది. ఏప్రిల్ నెలలో కాంట్రాక్టు బంగారం ధర రూ.47,953. ఇక్కడ కూడా బంగారం ధర రూ.67 పెరిగింది. వెండి విషయానికి వస్తే MCXలో మార్చి కాంట్రాక్టు వెండి ధర కిలోకు రూ.98 పెరిగి రూ.61701కి చేరుకుంది. ఇదిలా ఉంటే, గత ట్రేడింగ్ వారంలో బంగారం ధర 10 గ్రాములకు రూ.390 పెరిగింది. కిలో వెండి ధర రూ.1,508 పెరిగింది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెబ్సైట్ ప్రకారం, గత వారం ప్రారంభంలో (జనవరి 10-14 మధ్య) బంగారం ధర 47,627గా ఉంది. గత శుక్రవారం 10 గ్రాముల పసిడి రూ. 48,017కి పెరిగింది. అదే సమయంలో కిలో వెండి ధర రూ.60,351 నుంచి రూ.61,859కి పెరిగింది.
బులియన్ మార్కెట్లో బంగారం
బులియన్ మార్కెట్లో బంగారం ధరల విషయానికి వస్తే, శుక్రవారం 24 క్యారెట్ల స్వచ్ఛత బంగారం ధర గ్రాము రూ.4814గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర గ్రాము రూ.4698గా నమోదైంది. IBGA జారీ చేసిన కానీ బంగారం ధరలకు GST ఉండదని గుర్తించండి. ఇదిలా ఉంటే బంగారం రేట్లను కేవలం ఒక మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తెలుసుకోవచ్చు. దీని కోసం, మీరు చేయాల్సిందల్లా ఈ నంబర్‌కు 8955-66-4433కు మిస్డ్ కాల్ ఇవ్వండి , మీ ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. ఇందులో మీరు తాజా ధరలను తనిఖీ చేయవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gold, Gold price, Gold Rate Today