బంగారం ధరలు నానాటికి పడిపోతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయంగా బంగారం ధరలు భారీగా పతనం అవుతున్నాయి. తాజాగా న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర ఏకంగా 1460 డాలర్లకు పతనం అయ్యింది. దీంతో దేశీయంగా సైతం బంగారం ధరలు తగ్గిపోతున్నాయి. అలాగే అటు మార్కెట్లో సైతం డిమాండ్ తగ్గడంతో బంగారం ధరలు దిగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సోమవారం మార్కెట్లో మేలిమి బంగారం (24 కేరట్లు) తులం (10 గ్రాములు) ధర హైదరాబాద్ లో రూ.39299కు పతనమైంది. అలాగే అటు విజయవాడలో రూ.39300కు పతనైంది. అలాగూ చెన్నైలో బంగారం ధర రూ.39295కు జారిపోయింది. ఇదిలా ఉంటే అంతర్జాతీయంగా చైనా, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం నేపథ్యంలో బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు మదుపరులు ఎక్కువగా ఉత్సాహం చూపించారు. అయితే తాజాగా అమెరికా, చైనా మధ్య ట్రేడ్ డీల్ కుదరడంతో మదుపరులు బంగారం నుంచి ఇతర మార్కెట్లలోకి తమ పెట్టుబడులను మళ్లిస్తున్నారు. దీంతో మరోసారి బంగారం ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.
అంతేకాదు బంగారం ధరలు అంతర్జాతీయంగా ఔన్సుకు 1450 డాలర్లకు పతనమయ్యే అవకాశం ఉందని బులియన్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే రూపీ సపోర్ట్ సైతం బంగారం ధరలను కుదేలు చేస్తున్నాయి. దీంతో బంగారం ఇదే ట్రెండ్ కొనసాగితే తులం బంగారం రూ.30 వేలకు పతనమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వాదనలు వినిపిస్తున్నాయి.
Published by:Krishna Adithya
First published:November 11, 2019, 16:53 IST