అమెరికా, చైనా మధ్య ట్రేడ్ డీల్ కుదరడంతో మదుపరులు బంగారం నుంచి ఇతర మార్కెట్లలోకి తమ పెట్టుబడులను మళ్లిస్తున్నారు. దీంతో మరోసారి బంగారం ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.
బంగారం ధరలు రోజు రోజుకి పతనం అవుతున్నాయి. దీనికి అంతర్జాతీయ కారణాలు కూడా కారణమనే చెప్పవచ్చు. ముఖ్యంగా న్యూయార్క్ బులియన్ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 1460 డాలర్ల వద్దకు పతనం అయ్యింది. సరిగ్గా రెండు నెలల క్రితం ఆగస్టులో ఔన్సు బంగారం ధర 1530 డాలర్ల దాకా పెరిగింది. అక్కడి నుంచి పసిడి ధర పతనమవుతూ వస్తోంది. దాదాపు 60 డాలర్లు పతనం అవ్వడం విశేషం. అంతర్జాతీయంగా చైనా, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం నేపథ్యంలో బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు మదుపరులు ఎక్కువగా ఉత్సాహం చూపించారు. అయితే తాజాగా అమెరికా, చైనా మధ్య ట్రేడ్ డీల్ కుదరడంతో మదుపరులు బంగారం నుంచి ఇతర మార్కెట్లలోకి తమ పెట్టుబడులను మళ్లిస్తున్నారు. దీంతో మరోసారి బంగారం ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.
అంతేకాదు బంగారం ధరలు అంతర్జాతీయంగా ఔన్సుకు 1450 డాలర్లకు పతనమయ్యే అవకాశం ఉందని బులియన్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే రూపీ సపోర్ట్ సైతం బంగారం ధరలను కుదేలు చేస్తున్నాయి. దీంతో బంగారం ఇదే ట్రెండ్ కొనసాగితే డిసెంబర్ నాటికి మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు సమాచారం.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.