• HOME
 • »
 • NEWS
 • »
 • BUSINESS
 • »
 • GOLD PRICE TODAY GOLD AND SILVER FALL THERE IS A GOOD INVESTMENT MK

Gold Rate: మహిళలకు గుడ్ న్యూస్...బంగారం ధర భారీగా పతనం..తులం ధర ఎంతంటే...

Gold Rate: మహిళలకు గుడ్ న్యూస్...బంగారం ధర భారీగా పతనం..తులం ధర ఎంతంటే...

(ప్రతీకాత్మక చిత్రం)

యూఎస్‌ కొత్త ప్రెసిడెంట్‌ జో బైడెన్‌ భారీ ఉపశమన ప్యాకేజీకి ప్రకటిస్తారు అనే నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకోనున్న అంచనాలు పెరుగుతున్నాయి. దీంతో బంగారం కంటే షేర్ మార్కెట్ ఈక్విటీలు తదితర పెట్టుబడి సాధనాలకు ప్రాధాన్యత పెరుగుతుందని తెలియజేశారు.

 • Share this:
  మహిళలకు శుభవార్త బంగారం ధరలు వరుసగా పడిపోతున్నాయి. అటు రిటైల్ మార్కెట్లోనూ, ఇటు ఫ్యూచర్స్‌ మార్కెట్లో వరుసగా ఆరు రోజులగా ధర పతనం అవుతోంది. అటు విదేశాల్లో సైతం బులియన్ మార్కెట్ బేర్ మంటోంది. అయితే, మంగళవారం రోజున బంగారం ధరల ధోరణి చూస్తే కూడా తగ్గుదల కనిపిస్తోంది. తాజా ధరల ప్రకారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 24 కేరట్ల బంగారం ధర రూ. 679 తగ్గి రూ. రూ. 44,760గా ఉంది. వద్ద స్థిరపడింది. దీంతో దాదాపు ఏడాది ఏడాది తర్వాత బంగారం ధరలు రూ.45 వేల దిగువకు దిగి వచ్చాయి. అటు వెండి కూడా పసిడి బాటలోనే పయనించింది. ఏకంగా రూ. 1847 తగ్గి రూ. 67,073 పలికింది. ఇదిలా ఉంటే 2021 తొలి నెల నుంచే బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత ఏడాది బంగారం ఏకంగా 25 శాతంపైగా పెరిగింది. గత ఆగస్ట్‌లో 10 గ్రాముల బంగారం ధర గరిష్టంగా రూ. 56,200ను తాకింది. కరోనా నేపథ్యంలో మదుపరులు సురక్షిత పెట్టుబడి సాధనంగా పసిడిని భావించి అందులో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. ప్రధానంగా కరోనా వైరస్‌ సృష్టించిన కల్లోలంతో ఆర్థిక వ్యవస్థలు మాంద్యం బారినపడటం ప్రభావం చూపినట్లు విశ్లేషకులు చెప్పారు. సాధారణంగా సంక్షోభ పరిస్థితుల్లో బంగారాన్ని రక్షణాత్మక పెట్టుబడిగా భావిస్తారు. అటు పసిడి ధర పెరుగుతుండటంతో వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు, ఈటీఎఫ్‌ సంస్థలు, ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడం జోరుకు కారణమైంది. ఫలితంగా 2020లో బంగారం అత్యధికంగా రాబడి ఇచ్చింది. అయితే ఇటీవల అమ్మకాలు పెరగడంతో డీలా పడుతూ వచ్చింది. దీంతో 2021లో ఇప్పటివరకూ 8 శాతం లేదా రూ. 4,000 క్షీణించింది. వెరసి రికార్డ్‌ గరిష్టం నుంచి చూస్తే ఆరు నెలల్లో 18 శాతం(రూ. 10,000) కోల్పోయింది.

  అటు బంగారం తగ్గడానికి గల ప్రధాన కారణాల్లో ఇటీవల యూఎస్‌ ట్రెజరీ బాండ్ల ధరలు బలహీనపడటంతో యీల్డ్స్‌ పుంజుకుంటున్నట్లు తెలుపుతున్నారు. దీనికితోడు ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ బలపడుతుండటం కూడా పసిడిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నట్లు తెలియజేశారు. యూఎస్‌ కొత్త ప్రెసిడెంట్‌ జో బైడెన్‌ భారీ ఉపశమన ప్యాకేజీకి ప్రకటిస్తారు అనే నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకోనున్న అంచనాలు పెరుగుతున్నాయి. దీంతో బంగారం కంటే షేర్ మార్కెట్ ఈక్విటీలు తదితర పెట్టుబడి సాధనాలకు ప్రాధాన్యత పెరుగుతుందని తెలియజేశారు. అంతేకాదు కోవిడ్ వ్యాక్సిన్ విడుదల చేయడంతో పరిస్థితులు తిరిగి సాధారణ స్థాయికి చేరుకోనున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అంతేకాదు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో పసిడిపై కస్టమ్స్‌ డ్యూటీని 2.5% తగ్గించడం కూడా దీనికి జత కలసింది. ఫలితంగా బంగారం ధరలు రూ. 45,000 మార్క్‌ దిగువకు చేరాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే బంగారం ధరలు మరోసారి రూ. 40 వేల దిగువకు చేరతాయిని భావిస్తున్నారు.
  Published by:Krishna Adithya
  First published:

  అగ్ర కథనాలు