హోమ్ /వార్తలు /బిజినెస్ /

Gold Rate Today: ఆ భయాలతో కుప్పకూలిన బంగారం ధర.. 2 ఏళ్ల కనిష్టానికి పతనం.. ఇప్పుడు కొనొచ్చా?

Gold Rate Today: ఆ భయాలతో కుప్పకూలిన బంగారం ధర.. 2 ఏళ్ల కనిష్టానికి పతనం.. ఇప్పుడు కొనొచ్చా?

 2 ఏళ్ల కనిష్టానికి పతనమైన బంగారం.. ఇప్పుడు కొనొచ్చా?

2 ఏళ్ల కనిష్టానికి పతనమైన బంగారం.. ఇప్పుడు కొనొచ్చా?

Today Gold Rate | బంగారం ధరలు తగ్గుతూనే వస్తున్నాయి. పసిడి రేటు (Gold Price) అంతర్జాతీయ మార్కెట్‌లో 2 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. పసిడి (Gold Rate) ప్రేమిలకులకు ఇది ఊరట కలిగించే అంశం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

    Gold Price Today | బంగారం ధర దిగివచ్చింది. పసిడి రేటు పడిపోయింది. బంగారం ప్రియులకు ఇది ఊరట కలిగించే అంశం. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు (Gold Price Today) ఏకంగా 2 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. 1661 డాలర్ల స్థాయికి క్షీణించింది. పసిడి రేటుకు 1685 డాలర్ల వద్ద బలమైన మద్దతు ఉంది. అయినా కూడా పుత్తడి ఈ స్థాయిని నిలుపుకోలేకపోయింది. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (MCX) మార్కెట్‌లో బంగారం ధర (Gold Rate Today) రూ.92 మేర తగ్గింది. పది గ్రాములకు రూ. 49,220 స్థాయికి దిగి వచ్చింది.

    కమొడిటి నిపుణుల ప్రకారం చూస్తే.. బంగారం ధరపై తీవ్ర ఒత్తిడి నెలకొందని తెలుస్తోంది. అమెరికా ఫెడరల్ రిజర్వు వచ్చే వారంలో ఫెడ్ రేటును ఏకంగా 100 బేసిస్ పాయింట్ల మేర పెంచొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. దీని వల్ల బంగారం ధరపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. అలాగే అమెరికా డాలర్ పుంజుకోవడంతో బంగారం ధర తగ్గుతూ వస్తోంది.

    ఎస్‌బీఐ కిర్రాక్ ఆఫర్లు.. భారీ క్యాష్‌బ్యాక్, రూ.వేలలో తగ్గింపు!

    బంగారం ధరగ్లోబల్ మార్కెట్లో ఔన్స్‌కు 1710 డాలర్ల దిగువున ఉన్నంత వరకు ట్రేడర్లు బంగారాన్ని పెరిగినప్పుడల్లా విక్రయించడం ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు. మోతీలాల్ ఓస్వాల్ వైస్ ప్రెసిడెంట్ (రీసెర్చ్) అమిత్ సజేజా మాట్లాడుతూ.. అమెరికా ఫెడరల్ రిజర్వు ఫెడ్ రేటును 100 బేసిస్ పాయింట్లు పెంచొచ్చనే మార్కెట్ అంచనాల వల్లనే బంగారం ధర పతనమౌతోందన్నారు. మార్కెట్ వర్గాలు ద్రవ్యోల్బణం తగ్గుతుందని అంచనా వేశారని, కానీ అమెరికా ద్రవ్యోల్బణం పైకి కదిలిందని తెలిపారు. దీని వల్ల ఫెడ్ రేటు 100 బేసిస్ పాయింట్లు పెరగొచ్చనే అంచనాలు నెలకొన్నాయన్నారు.

    ఎస్‌బీఐ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త.. ఆ చార్జీలు తొలగించిన బ్యాంక్

    డాలర్ ఇండెక్స్ కూడా 110 స్థాయికి చేరుతోందని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అనూజ్ గుప్తా తెలిపారు. ఫెడ్ రేటు పెరగొచ్చనే అంచనాలు భారీగా ఉండటంతో రానున్న రోజుల్లో డాలర్ ఇండెక్స్ మరింత పైకి కదలొచ్చని తెలిపారు. బంగారం రేటు 1640 నుంచి 1685 డాలర్ల స్థాయిలో ఉండొచ్చని పేర్కన్నారు. ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధరకు రూ. 48,800 స్థాయి వద్ద తక్షణ మద్దతు లభిస్తోందన్నారు. తర్వాతి మద్దుతు స్థాయి రూ. 48,300. అలాగే బంగారం రేటుకు రూ. 49,700 వద్ద, రూ. 50,200 వద్ద నిరోధం ఉందని అన్నారు. అంటే ఫెడ్ మీటింగ్ అయ్యిపోయేంత వరకు బంగారం ధరపై ప్రతికూల ప్రభావం కొనసాగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. బంగారంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని భావించే వారు, ట్రేడర్లు జాగ్రత్తగా ఉండాలి. అదే బంగారం ఆభరణాలు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది తీపికబురు అని చెప్పుకోవచ్చు.

    Published by:Khalimastanvali Khalimastanvali
    First published:

    Tags: Gold, Gold price, Gold Price Today, Gold rate, Gold Rate Today

    ఉత్తమ కథలు