GOLD PRICE TODAY 11 JANUARY 2022 THE LATEST RATES OF GOLD AND SILVER MK
Gold Price Today: పెరుగుతున్న బంగారం ధర..మహిళలకు బ్యాడ్ న్యూస్..కారణాలు ఇవే...
(ప్రతీకాత్మక చిత్రం)
Gold Price: బంగారం ధరలు మరోసారి పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. అటు అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలు పెరుగుతున్నాయి. దీంతో అంతర్జాతీయ ధరల నేపథ్యంలో మంగళవారం దేశ రాజధాని బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.104 పెరిగి రూ.46,606 వద్ద ముగిసింది.
Gold Price: బంగారం ధరలు మరోసారి పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. అటు అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలు పెరుగుతున్నాయి. దీంతో అంతర్జాతీయ ధరల నేపథ్యంలో మంగళవారం దేశ రాజధాని బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.104 పెరిగి రూ.46,606 వద్ద ముగిసింది. గత ట్రేడింగ్ సెషన్లో 10 గ్రాముల బంగారం ధర రూ.46,502 వద్ద ముగిసింది. వెండి కూడా రూ.408 పెరిగి కిలో ధర రూ.59,700 వద్ద ముగిసింది. గత ట్రేడింగ్ సెషన్లో కిలో రూ.59,292 వద్ద ముగిసింది. అటు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్(31 గ్రాములు)కు 1,809 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, వెండి ఔన్స్‌కు 22.63 డాలర్ల వద్ద స్థిరపడింది. హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) తపన్ పటేల్ మాట్లాడుతూ, "మంగళవారం న్యూయార్క్ ఆధారిత కమోడిటీ ఎక్స్ఛేంజ్ కామెక్స్‌లో స్పాట్ బంగారం ఔన్స్‌కు 1,809 డాలర్లు స్వల్పంగా పెరిగింది. US బాండ్ ఈల్డ్‌లలో బలహీనత, 1800 డాలర్ల వద్ద బంగారానికి మద్దతు లభంచింది నిచ్చింది.
మీరు ఇంట్లో కూర్చొని ఈ రేట్లను సులభంగా కనుగొనవచ్చు. ఇందు కోసం 8955664433 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండి , మీ ఫోన్‌కు మెసేజ్ వస్తుంది, దీనిలో మీరు తాజా ధరలను తనిఖీ చేయవచ్చు.
బంగారం స్వచ్ఛతను తనిఖీ చేయాలనుకుంటే, దీని కోసం ప్రభుత్వం ఒక యాప్‌ను రూపొందించింది. 'బిఐఎస్ కేర్ యాప్'తో వినియోగదారులు బంగారం స్వచ్ఛతను చెక్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా బంగారం స్వచ్ఛతను సరిచూసుకోవడమే కాకుండా దానికి సంబంధించిన ఎలాంటి ఫిర్యాదునైనా చేయవచ్చు. ఈ యాప్‌లో లైసెన్స్, రిజిస్ట్రేషన్ , హాల్‌మార్క్ నంబర్ తప్పుగా గుర్తించినట్లయితే, కస్టమర్ వెంటనే దాని గురించి ఫిర్యాదు చేయవచ్చు. ఈ యాప్ ద్వారా కస్టమర్ ఫిర్యాదును వెంటనే నమోదు చేయడం గురించి సమాచారాన్ని కూడా పొందుతారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.