బంగారం ధర ఊగిసలాడుతోంది. ఓరోజు తగ్గుతూ, మరోరోజు పెరుగుతూ అంచనాలకు అందట్లేదు. గురువారం హైదరాబాద్లో బంగారం ధర భారీగా తగ్గడం పసిడిప్రేమికులకు సంతోషాన్ని అందించింది. కానీ ఆ సంతోషం ఒక్కరోజు కూడా మిగల్లేదు. శుక్రవారం గోల్డ్ రేట్ భారీగా పెరిగింది. న్యూ ఢిల్లీలో 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.1,395 పెరిగి రూ.41,705 ధరకు చేరుకుంది. హైదరాబాద్లో 10 గ్రాముల బంగారంపై రూ.750 పెరిగింది. ప్రస్తుతం 24 క్యారట్ బంగారం ధర రూ.42,670 కాగా, 22 క్యారట్ గోల్డ్ ధర రూ.39,090. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,514 డాలర్లు.
మరోవైపు వెండి ధర కూడా భారీగా పెరిగింది. న్యూ ఢిల్లీలో కేజీ వెండిపై ఒక్క రోజులోనే ఏకంగా రూ.2,889 పెరిగి రూ.38,100 ధరకు చేరుకుంది. హైదరాబాద్లో కేజీ వెండిపై రూ.510 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.40,500. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి ధర 12 డాలర్లు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పరుగులు తీయడం వల్లే ఇండియాలో గోల్డ్ రేట్ పెరిగిందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Good News: ఏటీఎం కార్డ్, క్రెడిట్ కార్డ్ ఉన్నవారికి ఆర్బీఐ గుడ్ న్యూస్
March 31 Deadline: ఈ 6 పనులకు మార్చి 31 చివరి తేదీ... వివరాలివే
EPFO: ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పెద్ద షాక్... దెబ్బకొట్టిన కరోనాPublished by:Santhosh Kumar S
First published:March 20, 2020, 17:43 IST