బంగారం ధర న్యూ ఢిల్లీలో వరుసగా రెండో రోజు కూడా పెరిగింది. గురువారం న్యూ ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.266 పెరిగిన సంగతి తెలిసిందే. శుక్రవారం మరో రూ.70 పెరిగి రూ.41,481 ధరకు చేరుకుంది. హైదరాబాద్‌లో మాత్రం బంగారం ధర స్వల్పంగా తగ్గడం విశేషం. 10 గ్రాముల 24 క్యారట్ ధర రూ.20 తగ్గగా, 22 క్యారట్ ధర రూ.40 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారట్ బంగారం ధర రూ.42,370 కాగా, 22 క్యారట్ ధర రూ.38,840. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,575.80 డాలర్లు. అంతకుముందు వరుసగా మూడు రోజులు బంగారం ధర తగ్గుతూ వచ్చింది. కానీ న్యూ ఢిల్లీలో రెండు రోజులుగా బంగారం ధర పెరుగుతుండటం కొనుగోలుదారుల్లో కలవరపరుస్తోంది.
ఇక న్యూ ఢిల్లీలో వెండి ధర పెరిగింది. కేజీ వెండిపై రూ.147 పెరిగి రూ.47,036 ధరకు చేరుకుంది. హైదరాబాద్‌లో మాత్రం వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.49,000. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి ధర 17.69 డాలర్లు. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 2 పైసలు పడిపోయి 71.33 దగ్గరకు చేరుకుంది. రూపాయి బలహీనపడటం వల్ల బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Gold: బంగారు నగలు కొనేవారు ఈ టిప్స్ ఫాలో అవండి
Online Gold: ఆన్లైన్లో బంగారు నగలు కొనొచ్చా? తెలుసుకోండి
SBI Gold Scheme: మీ నగలు డిపాజిట్ చేస్తే ఎస్బీఐ నుంచి వడ్డీ... ఈ స్కీమ్ గురించి తెలుసుకోండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gold, Gold bars, Gold jewellery, Gold ornmanets, Gold prices, Gold rate hyderabad, Gold rates, Gold shops, Silver rates