పసిడిప్రియులకు షాక్ తగిలింది. అక్షయ తృతీయకు ముందు బంగారం ధర భారీగా పెరిగింది. ఏప్రిల్ 26న అక్షయ తృతీయ ఉన్న సంగతి తెలిసిందే. అయితే వరుసగా బంగారం ధరలు తగ్గుతుండటంతో పసిడిప్రేమికులు హమ్మయ్య అనుకున్నారు. మూడు రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.2,000 తగ్గడంతో అక్షయ తృతీయ నాటికి గోల్డ్ రేట్ మరింత తగ్గుతుందని భావించారు. కానీ బంగారం ధరలు బుధవారం ఒక్కసారిగా పెరిగాయి. హైదరాబాద్లో 24 క్యారట్ బంగారం ధర 10 గ్రాములపై రూ.680 పెరిగింది. ప్రస్తుత ధర రూ.44,780. ఇక 22 క్యారట్ బంగారం ధర రూ.650 పెరిగింది. ప్రస్తుత ధర రూ.41,050. హైదరాబాద్లో వెండి ధర తగ్గింది. కేజీపై రూ.240 తగ్గి రూ.41,410 ధరకు చేరుకుంది. నాలుగు రోజుల్లో అక్షయ తృతీయ ఉండటంతో బంగారం ధరలు ఎలా ఉంటాయని పసిడిప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే లాక్డౌన్ కారణంగా నగల షాపులు మూసేసి ఉన్నా, కొన్ని సంస్థలు ఆన్లైన్లో బంగారాన్ని అమ్ముతున్నాయి.
మరోవైపు మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములపై 1% పెరిగి రూ.45,768 ధరకు చేరుకుంది. గతవారం ధర రూ.47,000 దాటిన సంగతి తెలిసిందే. ఇక కేజీ వెండిపై 0.35% శాతం తగ్గి రూ.41,602 ధరకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగాయి. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,685.46 డాలర్లు. ఔన్స్ వెండి ధర 14.88 డాలర్లు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.