• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • GOLD PRICE RISES RS 670 TO RS 42970 IN HYDERABAD KNOW LATEST GOLD AND SILVER RATES SS

Gold Price Today: బంగారం కొనేవారికి షాక్... పెరిగిన గోల్డ్ రేట్స్ ఇవే

Gold Price Today: బంగారం కొనేవారికి షాక్... పెరిగిన గోల్డ్ రేట్స్ ఇవే

Gold Price Today: బంగారం కొనేవారికి షాక్... పెరిగిన గోల్డ్ రేట్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Gold rate today in Hyderabad | బంగారం ధర తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగింది. బుధవారం హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరల వివరాలివే.

  • Share this:
    బంగారం కొనేవారికి మళ్లీ షాక్. తగ్గినట్టే తగ్గిన గోల్డ్ రేట్ మళ్లీ పెరిగింది. మంగళవారం హైదరాబాద్‌లో బంగారం ధర భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. 10 గ్రాములపై ఏకంగా రూ.920 తగ్గింది. గత 10 రోజులుగా చూస్తున్న బంగారం ధర పతనమవుతూనే ఉంది. దీంతో గోల్డ్ రేట్ ఇంకా తగ్గొచ్చని అంచనా వేశారు. కానీ బుధవారం గోల్డ్ రేట్ మళ్లీ పెరిగింది. హైదరాబాద్‌లో ఏకంగా రూ.600 పైనే పెరిగింది. 24 క్యారట్ బంగారం ధర రూ.670 పెరిగి రూ.42,970 ధరకు చేరుకోగా, 22 క్యారట్ ధర రూ.690 పెరిగి 39,390 ధరకు చేరుకుంది. న్యూ ఢిల్లీలోనూ గోల్డ్ రేట్ పెరిగింది. స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములపై రూ.311 పెరిగి రూ.40,241 ధరకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1,490 డాలర్లు.

    హైదరాబాద్‌లో వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కానీ న్యూ ఢిల్లీలో వెండి ధర తగ్గడం విశేషం. కేజీ వెండిపై రూ.468 తగ్గి రూ.35,948 ధరకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ వెండి ధర 12.38 డాలర్లు. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 13 పైసలు బలహీనపడింది. బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్లే ధర పెరిగిందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. బుధవారం బంగారం ధర పెరిగినా... కొంతకాలంగా చూస్తే గోల్డ్ రేట్ తగ్గుతుండటం విశేషం. వారం రోజుల్లో రూ.4,000 పైనే బంగారం ధర తగ్గింది.

    ఇవి కూడా చదవండి:

    Credit Card: క్రెడిట్ కార్డుపై మీరు కట్టే వడ్డీ ఎంతో తెలిస్తే షాకే

    Aadhaar SMS Services: ఎస్ఎంఎస్‌ ద్వారా ఆధార్ సేవలు... స్టెప్స్ ఇవే

    Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ఈ 12 స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్
    Published by:Santhosh Kumar S
    First published: