Gold Price: బంగారం కొనాలనుకునేవారికి షాక్... రికార్డు స్థాయిలో పెరిగిన గోల్డ్ రేట్

Gold Rate Today | అమెరికా, చైనా మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు నెలకొనడం, దేశీయంగా ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారని, అందుకే గోల్డ్ రేట్స్ పెరుగుతున్నాయని మార్కెట్ వర్గాల అంచనా.

news18-telugu
Updated: August 8, 2019, 5:37 PM IST
Gold Price: బంగారం కొనాలనుకునేవారికి షాక్... రికార్డు స్థాయిలో పెరిగిన గోల్డ్ రేట్
Gold Price: బంగారం కొనాలనుకునేవారికి షాక్... రికార్డు స్థాయిలో పెరిగిన గోల్డ్ రేట్ (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 8, 2019, 5:37 PM IST
బంగారం ధర భారీగా పెరుగుతోంది. మొదటిసారి రూ.38,000 మార్క్‌ను దాటేసింది గోల్డ్. న్యూ ఢిల్లీలో గురువారం 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.550 పెరిగింది. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.1,113 పెరిగిన విషయం తెలిసిందే. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ సమాచారం ప్రకారం ప్రస్తుతం న్యూ ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం ధర రూ.38,470 కాగా, 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం ధర రూ.38,300. హైదరాబాద్‌లో 24 క్యారెట్ బంగారం ధర రూ.38,950 కాగా, 22 క్యారెట్ బంగారం ధర రూ.35,580. బంగారం ధరలు ఇలాగే పెరిగితే రూ.40,000 ధర దాటడానికి ఎక్కువ రోజులు పట్టదు. ఇక 8 గ్రాముల సావరిన్ గోల్డ్ ధర రూ.700 పెరిగింది. ప్రస్తుతం 8 గ్రాముల సావరిన్ గోల్డ్ ధర రూ.28,500. అంతర్జాతీయంగా చూస్తే ఔన్స్ బంగారం ధర 1,497.40 డాలర్లకు చేరుకొని 1500 డాలర్లను సమీపించింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు నెలకొనడం, దేశీయంగా ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారని, అందుకే గోల్డ్ రేట్స్ పెరుగుతున్నాయని మార్కెట్ వర్గాల అంచనా.

ఇక వెండి ధర కూడా పరుగులు తీస్తూ రూ.44,000 మార్క్ దాటింది. బుధవారం కేజీ వెండిపై రూ.650 పెరిగితే గురువారం రూ.550 పెరిగింది. దీంతో కేజీ వెండి రూ.44,300 ధరకు చేరుకుంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.44,525. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఎక్కువవడంతో వెండికి డిమాండ్ పెరిగింది. 100 వెండి నాణేల ధర కూడా రూ.1,000 పెరిగింది. 100 వెండి నాణేల కొనుగోలు ధర రూ.87,000 కాగా అమ్మకం ధర రూ.88,000. అంతర్జాతీయంగా చూస్తే ఔన్స్ వెండి ధర 17.16 డాలర్లు.

Photos: రెడ్‌మీ కే 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌తో తళుక్కుమన్న బాలీవుడ్ తారలు




ఇవి కూడా చదవండి:

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో ఈ 10 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్

Business: టమాటా సాస్ వ్యాపారం... నెలకు రూ.40,000 ఆదాయం
Loading...
DRDO Scholarship: అమ్మాయిలకు గుడ్ న్యూస్... డీఆర్‌డీఓ నుంచి స్కాలర్‌షిప్

 
First published: August 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...