Gold Price Today: పసిడి ప్రేమికులకు షాక్... భారీగా పెరిగిన బంగారం ధర

Gold Rate Today | మీరు బంగారం కొనే ఆలోచనలో ఉన్నారా? ధరలు బాగా పెరిగిపోతున్నాయి. బుధవారం ఒక్క రోజే గోల్డ్ రేట్ రూ.500 పెరిగింది. హైదరాబాద్‌లో గోల్డ్ లేటెస్ట్ రేట్స్ ఇవే.

news18-telugu
Updated: February 19, 2020, 5:51 PM IST
Gold Price Today: పసిడి ప్రేమికులకు షాక్... భారీగా పెరిగిన బంగారం ధర
Gold Price Today: పసిడి ప్రేమికులకు షాక్... భారీగా పెరిగిన బంగారం ధర (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
బంగారం కొనాలనునే పసిడి ప్రేమికులకు బుధవారం షాక్ తగిలింది. బంగారం ధర భారీగా పెరిగింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.520 పెరిగింది. స్వచ్ఛమైన బంగారం ధర రూ.43,000 మార్క్ దాటింది. ఆభరణాల తయారీకి ఉపయోగించే బంగారం ధర రూ.40,000 మార్క్‌కు చేరువలో ఉంది. హైదరాబాద్‌లో లేటెస్ట్ గోల్డ్ రేట్స్ చూస్తే 10 గ్రాముల 24 క్యారట్ బంగారం ధర రూ.43,160 కాగా, 22 క్యారట్ ధర రూ.39,650. న్యూ ఢిల్లీలో బంగారం ధర రూ.462 పెరిగి రూ.42,000 మార్క్‌ను దాటింది. ప్రస్తుతం దేశ రాజధానిలో 10 గ్రాముల బంగారం ధర రూ.42,339. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1,606.60 డాలర్లు. పెళ్లిళ్ల సీజన్‌లో బంగారానికి డిమాండ్ పెరుగుతుండటం, గ్లోబల్ ట్రెండ్స్ పాజిటీవ్‌గా ఉండటం బంగారం ధర పెరగడానికి కారణమని విశ్లేషిస్తున్నారు మార్కెట్ నిపుణులు. అంతేకాదు కరోనా వైరస్ కారణంగా 2020 మార్చి త్రైమాసికానికి తమ ఆదాయ అంచనాలను అందుకోలేమని యాపిల్ ప్రకటించడంతో ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తుండటం కూడా గోల్డ్ ధర పెరగడానికి కారణమన్న వాదన వినిపిస్తోంది.

బంగారం మాత్రమే కాదు... బుధవారం వెండి ధర కూడా భారీగా పెరిగింది. హైదరాబాద్‌లో కేజీ వెండిపై రూ.400 పెరిగింది. ప్రస్తుతం కిలో బంగారం ధర రూ.49,900. హైదరాబాద్‌లో కేజీ వెండి రూ.50,000 మార్క్‌ను సమీపిస్తోంది. ఇక న్యూ ఢిల్లీలో కిలో వెండి ధర ఏకంగా రూ.1,047 పెరిగి రూ.48,652 ధరకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ వెండి ధర 18.32 డాలర్లు.

ఇవి కూడా చదవండి:

Gold: బంగారు నగలు కొనేవారు ఈ టిప్స్ ఫాలో అవండి



Online Gold: ఆన్‌లైన్‌లో బంగారు నగలు కొనొచ్చా? తెలుసుకోండి

Credit Card: క్రెడిట్ కార్డుపై మీరు చెల్లిస్తున్న వడ్డీ ఎంతో తెలిస్తే షాకే
First published: February 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు