హోమ్ /వార్తలు /బిజినెస్ /

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు... లేటెస్ట్ రేట్స్ ఇవే

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు... లేటెస్ట్ రేట్స్ ఇవే

Gold Price (ప్రతీకాత్మక చిత్రం)

Gold Price (ప్రతీకాత్మక చిత్రం)

Gold Rate Today | సోమవారం ఉదయం బంగారం ధర స్వల్పంగా తగ్గినట్టు కనిపించినా సాయంత్రానికి ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1,574 డాలర్లు.

మూడు రోజులుగా వరుసగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడట్లేదు. నాలుగో రోజు కూడా బంగారం ధరలు పెరిగాయి. గత వారం బంగారం ధర రూ.500 వరకు పెరిగిన సంగతి తెలసిందే. సోమవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారట్ బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. 10 గ్రాముల ధర రూ.42,530. ఇక 22 క్యారట్ బంగారం ధర రూ.10 తగ్గింది. ప్రస్తుత ధర రూ.38,980. కానీ న్యూ ఢిల్లీలో స్వచ్ఛమైన బంగారం ధరపై రూ.52 పెరిగింది. ప్రస్తుతం న్యూ ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.41,508. సోమవారం ఉదయం బంగారం ధర స్వల్పంగా తగ్గినట్టు కనిపించినా సాయంత్రానికి ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1,574 డాలర్లు.

మరోవైపు వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.300 పెరిగింది. ప్రస్తుత ధర రూ.49,300. న్యూ ఢిల్లీలో కేజీ వెండి రూ.190 పెరిగి రూ.47,396 ధరకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ వెండి ధర 17.80 డాలర్లు. ఇక యూఎస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి కాస్త పెరిగి 71.37 దగ్గర ఆగింది. సోమవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ హెచ్చుతగ్గుల కారణంగా బంగారం, వెండి ధరలు పెరిగాయని విశ్లేషిస్తున్నారు మార్కెట్ నిపుణులు.

ఇవి కూడా చదవండి:

Gold: బంగారు నగలు కొనేవారు ఈ టిప్స్ ఫాలో అవండి

Gold: బంగారు నగలు ఆన్‌లైన్‌లో కొంటే లాభమా? నష్టమా?

SBI Gold Scheme: మీ నగలు డిపాజిట్ చేస్తే ఎస్‌బీఐ నుంచి వడ్డీ... ఈ స్కీమ్ గురించి తెలుసుకోండి

First published:

Tags: Gold, Gold jewellery, Gold ornmanets, Gold price down, Gold prices, Gold rate hyderabad, Gold rates, Gold shops, Silver rates

ఉత్తమ కథలు