బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే మీకు షాకే. బంగారం ధర రికార్డు స్థాయిలో పెరుగుతోంది. కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ రోజే 10 గ్రాములపై ఏకంగా రూ.2,000 ధర పెరిగింది. 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.45,000 మార్క్ దాటింది. ఫ్యూచర్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం రూ.45,724 ధరను చేరుకుంది. ఎంసీఎక్స్ జూన్ ఫ్యూచర్స్‌లో బంగారం 3.5 శాతం పెరిగి రూ.45,269 ధరకు చేరుకుంది. డొమెస్టిక్ మల్టీ కమొడిటీ మార్కెట్లో 10 గ్రాముల గోల్డ్‌పై రూ.1,403 పెరిగింది. ప్రస్తుతం రూ.45,125 దగ్గర ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారట్ బంగారం ధర రూ.44,040 కాగా, 22 క్యారట్ బంగారం ధర రూ.40,040. అంతర్జాతీయ మార్కెట్లో ర్యాలీ కారణంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 0.2% శాతం పెరిగింది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,657.67 డాలర్లు.
బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగానే పెరిగింది. ఎంసీఎక్స్ సిల్వర్ ఫ్యూచర్స్‌లో వెండి ధర 5% పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.43,345. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి తీవ్ర ప్రభావం చూపిస్తుండటంతో ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు. తమ పెట్టుబడులను బంగారం కొనుగోళ్ల వైపు మళ్లిస్తున్నారు. బంగారానికి డిమాండ్ పెరగడంతో ధరలు రికార్డు సృష్టిస్తున్నాయి. నెల రోజుల్లోనే బంగారం ధర 20 శాతం పెరిగి లాభాలను పంచింది.
ఇవి కూడా చదవండి:
Coronavirus: ఆస్పత్రులుగా మారిపోతున్న రైళ్లు... 40,000 ఐసోలేషన్ బెడ్స్ రెడీ
Lockdown: ఏటీఎం కార్డులు వాడట్లేదా? స్విచ్చాఫ్ చేయండి ఇలా
Moratorium: మారటోరియంపై బ్యాంకులకు కీలక ఆదేశాలు ఇచ్చిన ఆర్బీఐPublished by:Santhosh Kumar S
First published:April 07, 2020, 12:54 IST