Gold Price: తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన బంగారం ధర... లేటెస్ట్ రేట్స్ ఇవే

Gold Rate Today | సెలవు మరుసటి రోజు కావడం, అంతర్జాతీయంగా చూస్తే భారతదేశంలో స్ట్రాంగ్‌గా ట్రేడ్ కావడం వల్ల బంగారం ధరలు పెరిగాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ తపన్ పటేల్ అభిప్రాయ పడ్డారు.

news18-telugu
Updated: October 3, 2019, 4:50 PM IST
Gold Price: తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన బంగారం ధర... లేటెస్ట్ రేట్స్ ఇవే
Gold Price: తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన బంగారం ధర... లేటెస్ట్ రేట్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: October 3, 2019, 4:50 PM IST
బంగారం ధర భారీగా తగ్గిందని అనుకుంటూ ఉండగానే మళ్లీ రేట్ పెరిగింది. గురువారం ఒక్క రోజే 10 గ్రాముల బంగారం ధర రూ.348 పెరిగింది. ప్రస్తుతం న్యూ ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.39,115. హైదరాబాద్‌లో ధరలు చూస్తే 10 గ్రాముల 22 క్యారట్, 24 క్యారట్ బంగారం ధర రూ.910 పెరిగింది. ప్రస్తుతం 22 క్యారట్ ధర రూ.36,360 కాగా, 24 క్యారట్ ధర రూ.39,580. ఇక అంతర్జాతీయ మార్గెట్‌లో చూస్తే ఔన్స్ బంగారం ధర 1,501 డాలర్లతో ట్రేడ్ అవుతోంది. సెలవు మరుసటి రోజు కావడం, అంతర్జాతీయంగా చూస్తే భారతదేశంలో స్ట్రాంగ్‌గా ట్రేడ్ కావడం వల్ల బంగారం ధరలు పెరిగాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ తపన్ పటేల్ అభిప్రాయ పడ్డారు. మరోవైపు వెండి ధర కూడా భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ.1,630 పెరిగి రూ.47,580 ధరకు చేరుకుంది. న్యూయార్క్‌లో ఔన్స్ వెండి ధర 17.61 డాలర్లు. మంగళవారం నాటు 10 గ్రాముల బంగారం ధర రూ.38,767 దగ్గర, కిలో వెండి ధర రూ.45,950 దగ్గర ముగిసింది.

Vivo S1: వివో ఎస్1 కొత్త వేరియంట్ రిలీజ్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:



SBI Charges: ఎస్‌బీఐ ఛార్జీల్లో మార్పు... మనీ ట్రాన్స్‌ఫర్, మంత్లీ బ్యాలెన్స్ కొత్త ఛార్జీలు తెలుసుకోండి

Post Office Scheme: పోస్ట్ ఆఫీస్‌లో టైమ్ డిపాజిట్ అకౌంట్‌... లాభాలేంటో తెలుసా?

IRCTC: పండుగకు ఊరెళ్తున్నారా? ఈ టెక్నిక్‌తో రైలు టికెట్ కన్ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ
First published: October 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...