GOLD PRICE RISES RS 260 TO RS 43420 IN HYDERABAD KNOW LATEST GOLD AND SILVER RATES SS
Gold Price Today: వరుసగా మూడో రోజు పెరిగిన బంగారం ధర... తులం ఎంతంటే
Gold Price Today: వరుసగా మూడో రోజు పెరిగిన బంగారం ధర... తులం ఎంతంటే
(ప్రతీకాత్మక చిత్రం)
Gold Price Today | వరుసగా మూడో రోజు కూడా బంగారం ధర పెరిగింది. పెళ్లిళ్ల సీజన్, ఇతర కారణాల వల్ల గోల్డ్ రేట్ పరుగులు తీస్తోంది. హైదరాబాద్లో లేటెస్ట్ గోల్డ్ రేట్స్ తెలుసుకోండి.
బంగారం ధర మళ్లీ పరుగులు తీస్తోంది. వరుసగా మూడు రోజులుగా బంగారం ధర పెరుగుతూనే ఉంది. ఫిబ్రవరి 17న 10 గ్రాముల రూ.233 తగ్గింది. ఆ తర్వాత వరుసగా మూడు రోజులుగా గోల్డ్ రేట్ పెరుగుతూనే ఉంది. హైదరాబాద్లో రెండు రోజులుగా ధరలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 19న రూ.520 ధర పెరిగితే, ఫిబ్రవరి 20న రూ.260 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్లో ధరలు చూస్తే 10 గ్రాముల 24 క్యారట్ గోల్డ్ ధర రూ.260 పెరిగి రూ.43,420 ధరకు చేరుకుంది. 22 క్యారట్ బంగారం ధర రూ.150 పెరిగి రూ.39,800 ధరకు చేరుకుంది. న్యూ ఢిల్లీలో ఫిబ్రవరి 18న రూ.239, ఫిబ్రవరి 19న రూ.462, ఫిబ్రవరి 20న రూ.111 ధర పెరిగింది. ప్రస్తుతం న్యూ ఢిల్లీలో స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.42,492. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,609.60 డాలర్లు.
ప్రతీకాత్మక చిత్రం
రూపాయి బలహీనపడటం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ పెరగడం వల్లే ధరలు పెరుగుతున్నాయని విశ్లేషిస్తున్నారు మార్కెట్ నిపుణులు. ఇక వెండి ధరలు చూస్తే హైదరాబాద్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.49,900. న్యూ ఢిల్లీలో కిలో వెండి ధర రూ.67 తగ్గింది. ప్రస్తుత ధర రూ.48,599. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి ధర 18.26 డాలర్లు.