Gold Price: మళ్లీ పెరిగిన బంగారం ధర... లేటెస్ట్ రేట్స్ ఇవే

Gold Price Today | స్థానిక నగల వ్యాపారులు, వర్తకుల నుంచి డిమాండ్ పెరగడంతో పాటు, ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించడం ధర పెరగడానికి కారణమని విశ్లేషిస్తున్నారు మార్కెట్ నిపుణులు.

news18-telugu
Updated: July 3, 2019, 5:36 PM IST
Gold Price: మళ్లీ పెరిగిన బంగారం ధర... లేటెస్ట్ రేట్స్ ఇవే
Gold Price: మళ్లీ పెరిగిన బంగారం ధర... లేటెస్ట్ రేట్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: July 3, 2019, 5:36 PM IST
బంగారం ధర మళ్లీ పెరిగింది. దేశ రాజధానిలో బుధవారం ఒక్కరోజే 10 గ్రాముల బంగారంపై రూ.260 పెరిగిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. ప్రస్తుతం న్యూ ఢిల్లీలో 99.9 స్వచ్ఛత గల బంగారం 10 గ్రాముల ధర రూ.34,380 కాగా, 99.5 స్వచ్ఛత గల బంగారం ధర రూ.34,210. ఇక 8 గ్రాముల సావరిన్ గోల్డ్ ధర రూ.26,800. హైదరాబాద్‌లో 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ.680 పెరిగింది. ప్రస్తుత ధర రూ.35,770. ఇక 22 క్యారెట్ గోల్డ్ ధర రూ.650 పెరిగింది. ప్రస్తుత ధర రూ.32,790. స్థానిక నగల వ్యాపారులు, వర్తకుల నుంచి డిమాండ్ పెరగడంతో పాటు, ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించడం ధర పెరగడానికి కారణమని విశ్లేషిస్తున్నారు మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయంగా చూస్తే ఔన్స్ బంగారం ధర 1,425.95 డాలర్లు.

మరోవైపు వెండి ధర కూడా కేజీపై రూ.150 పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.38,650. పారిశ్రామికవర్గాల నుండి వెండికి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ధర పెరిగిందని అంచనా. 100 వెండి నాణేల కొనుగోలు ధర రూ.80,000 కాగా అమ్మకం ధర రూ.81,000. ఇక న్యూయార్క్‌లో ఔన్స్ వెండి ధర 15.31 డాలర్లు.

BMW Bike: బీఎండబ్ల్యూ నుంచి కొత్త బైక్... ఎలా ఉందో చూడండి





ఇవి కూడా చదవండి:

బంగారం కొనేముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

SBI Gold Scheme: మీ బంగారం డిపాజిట్ చేస్తే వడ్డీ ఇవ్వనున్న ఎస్‌బీఐ
Loading...
Good News: కొత్త సేవలు ప్రారంభించిన ఎల్ఐసీ... ఇక ప్రీమియం చెల్లింపులు చాలా ఈజీ
First published: July 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...