Gold Price: కొత్త రికార్డులు సృష్టిస్తున్న బంగారం ధర... లేటెస్ట్ రేట్స్ ఇవే

Gold Rate Today | రాజకీయ, ఆర్థికపరమైన అనిశ్చితి ఉన్నప్పుడు బంగారాన్ని మించిన సురక్షితమైన పెట్టుబడి సాధనం లేదని నమ్ముతుంటారు ఇన్వెస్టర్లు. గోల్డ్ ధర ఈ స్థాయిలో పెరగడానికి ఈ నమ్మకం కూడా ఓ కారణం.

news18-telugu
Updated: August 29, 2019, 5:31 PM IST
Gold Price: కొత్త రికార్డులు సృష్టిస్తున్న బంగారం ధర... లేటెస్ట్ రేట్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
బంగారం కొనాలనుకుంటున్నారా? బంగారంపై ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నారా? కాస్త ఆలోచించాల్సిన సమయం ఇది. బంగారం ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. గోల్డ్ ధర రికార్డులు సృష్టిస్తోంది. రూ.40,000 మార్క్‌ను దాటింది. న్యూ ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.250 పెరిగి రూ.40,220 ధరకు చేరుకుంది. ఇది ఆల్ టైమ్ హై. ప్రస్తుతం న్యూ ఢిల్లీలో 99.9% స్వచ్ఛత గల బంగారం 10 గ్రాముల ధర రూ.40,220 కాగా, 99.5% స్వచ్ఛత గల బంగారం ధర రూ.40,050. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ బంగారం ధర రూ.40,440 కాగా, 22 క్యారెట్ ధర రూ.37,130. 8 గ్రాముల సావరిన్ గోల్డ్ ధర రూ.400 పెరిగి రూ.30,200 ధరకు చేరుకుంది. రాజకీయ, ఆర్థికపరమైన అనిశ్చితి ఉన్నప్పుడు బంగారాన్ని మించిన సురక్షితమైన పెట్టుబడి సాధనం లేదని నమ్ముతుంటారు ఇన్వెస్టర్లు. గోల్డ్ ధర ఈ స్థాయిలో పెరగడానికి ఈ నమ్మకం కూడా ఓ కారణం.

మరోవైపు వెండి ధర కేజీపై రూ.200 పెరిగింది. కేజీ వెండి ధర రూ.49,050 చేరుకొని రూ.50,000 వైపు పరుగులు తీస్తోంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.49,160. ఇక మార్కెట్‌లో 100 వెండి నాణేల ధర రూ.3,000 ధర పెరిగింది. 100 వెండి నాణేల కొనుగోలు ధర రూ.₹1,01,000 కాగా అమ్మకం ధర రూ.₹1,02,000. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీపడటం, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా బంగారం వెండి ధరలు పెరిగి ఇండియన్ మార్కెట్‌లో రికార్డ్ ధరల్ని తాకుతోందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య చర్చలపై మార్కెట్ పరిస్థితులు ఆధారపడనున్నాయి.

Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి



August Smartphones: ఆగస్ట్‌లో రిలీజైన 10 కొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే... ఫీచర్స్ తెలుసుకోండి

Revolt: నెలకు రూ.2999 చెల్లించి ఈ బైక్ సొంతం చేసుకోవచ్చు

IRCTC: హనీమూన్ ప్లాన్ చేసుకుంటున్నారా? ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే
First published: August 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading