బంగారం కొనాలనుకుంటున్నారా? గోల్డ్ రేట్ మళ్లీ పెరిగింది. వరుసగా రెండు రోజులు బంగారం ధరలు తగ్గినట్టు కనిపించినా... గురువారం మళ్లీ ధర పెరిగింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.240 పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారట్ బంగారం ధర రూ.42,390 కాగా, 22 క్యారట్ గోల్డ్ రేటు రూ.38,880. న్యూ ఢిల్లీలో స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.266 పెరిగింది. ప్రస్తుత ధర రూ.41,484. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.41,218 దగ్గర ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,574 డాలర్లు. మరోవైపు వెండి ధరలు చూస్తే హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.200 పెరిగింది. ప్రస్తుత ధర రూ.49,000. న్యూ ఢిల్లీలో కేజీ వెండిపై రూ.55 పెరిగి రూ.46,630 ధరకు చేరుకుంది. బుధవారం కేజీ వెండి ధర రూ.46,630 దగ్గర ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి ధర 17.64 డాలర్లు.
ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 10 పైసలు బలహీనపడింది. రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ ట్రెండ్స్ లాంటి అంశాలతో పాటు కొత్త కరోనా వైరస్ కేసులు బయటపడుతుండటం వల్ల మదుపరులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తుండటం గోల్డ్ రేట్ పెరగడానికి కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Gold: బంగారు నగలు కొనేవారు ఈ టిప్స్ ఫాలో అవండి
Online Gold: ఆన్లైన్లో బంగారు నగలు కొనొచ్చా? తెలుసుకోండి
Aadhaar Card: మీ పిల్లలకు ఆధార్ కార్డు ఉందా? ఈ సేవలు ఉచితంPublished by:Santhosh Kumar S
First published:February 13, 2020, 18:24 IST