కరోనా వైరస్ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలపై తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. బంగారం హెచ్చుతగ్గులకు కరోనా వైరస్ కారణమవుతోంది. కరోనా వైరస్ విస్తరిస్తుందన్న భయంతో ఇన్వెస్టర్లు బంగారాన్ని సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా భావిస్తున్నారు. దీంతో బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. సోమవారం పెరిగిన బంగారం ధర ఆ తర్వాత రెండు రోజుల్లోనే రూ.1,000 పైగా తగ్గింది. హమ్మయ్య... బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయని సంబరపడుతుండగానే గోల్డ్ రేట్ మళ్లీ షాకిచ్చింది. గురువారం బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం ధర రూ.210 పెరిగింది. ప్రస్తుతం 24 క్యారట్ బంగారం ధర రూ.44,550 కాగా, 22 క్యారట్ ధర రూ.40,820. ఇక న్యూ ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.78 పెరిగింది. ప్రస్తుతం గోల్డ్ రేట్ రూ.43,513. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,649 డాలర్లు.
కరోనావైరస్ వ్యాప్తిపై ఆందోళనల నేపథ్యంలో ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించడమే బంగారం ధర పెరగడానికి కారణమని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముంది. ఇక వెండి ధరలు చూస్తే హైదరాబాద్లో రేటు స్వల్పంగా తగ్గింది. కేజీ వెండిపై రూ.200 తగ్గడంతో రూ.49,600 ధరకు చేరుకుంది. న్యూ ఢిల్లీలో కేజీ వెండిపై రూ.35 పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి రూ.48,130. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి ధర 18.05 డాలర్లు.
ఇవి కూడా చదవండి:
Gold Discount: బంగారంపై రూ.6,000 డిస్కౌంట్... కొనండి ఇలా
EPF-Aadhaar Link: ఈపీఎఫ్ అకౌంట్కు ఆధార్ నెంబర్ లింక్ చేయండి ఇలా
Post Office Account: పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉన్నవారికి షాక్... మీ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BUSINESS NEWS, Gold, Gold bars, Gold jewellery, Gold ornmanets, Gold prices, Gold rate hyderabad, Gold rates, Gold shops, Silver rates