Gold Price: దీపావళి ముందు మంచి ఛాన్స్... నెల రోజులో రూ.2,000 తగ్గిన బంగారం

Gold Rate Today | రెండ్రోజుల్లో ధంతేరాస్, ఆ తర్వాత దీపావళి ఉండటంతో బంగారానికి డిమాండ్ పెరిగే ఛాన్సుంది. పర్వదినాల్లో బంగారం కొనేందుకు భారతీయులు ఆసక్తి చూపిస్తారన్న సంగతి తెలిసిందే. డిమాండ్ పెరిగితే బంగారం ధర కూడా పెరిగే అవకాశం ఉంది.

news18-telugu
Updated: October 23, 2019, 6:25 PM IST
Gold Price: దీపావళి ముందు మంచి ఛాన్స్... నెల రోజులో రూ.2,000 తగ్గిన బంగారం
Gold Price: దీపావళి ముందు మంచి ఛాన్స్... నెల రోజులో రూ.2,000 తగ్గిన బంగారం (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
దీపావళి, ధంతేరాస్ పర్వదినాల సందర్భంగా బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త. ఒక్క నెలలోనే 10 గ్రాముల బంగారం రూ.2,000 తగ్గింది. ఈ ఏడాదిలో బంగారం ధర 20% వరకు పెరిగిన సంగతి తెలిసిందే. గత నెలలో రూ.40,000 మార్క్ కూడా దాటేసింది. అయితే నెల రోజులుగా బంగారం ధర స్వల్పంగా తగ్గుతూ వస్తోంది. నెల రోజుల్లో చూస్తే 10 గ్రాములపై ఏకంగా రూ.2,000 వరకు తగ్గింది. అయితే వరుసగా మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర స్వల్పంగా పెరిగింది. న్యూ ఢిల్లీలో 10 గ్రాముల బంగారంపై రూ.177 పెరిగింది. ప్రస్తుతం న్యూ ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.38,932. హైదరాబాద్‌లో ధరలు చూస్తే ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ.39,960. ఇక 22 క్యారెట్ బంగారం ధర రూ.36,630.

రెండ్రోజుల్లో ధంతేరాస్, ఆ తర్వాత దీపావళి ఉండటంతో బంగారానికి డిమాండ్ పెరిగే ఛాన్సుంది. పర్వదినాల్లో బంగారం కొనేందుకు భారతీయులు ఆసక్తి చూపిస్తారన్న సంగతి తెలిసిందే. డిమాండ్ పెరిగితే బంగారం ధర కూడా పెరిగే అవకాశం ఉంది. బంగారం ధర మరోసారి రూ.39,000 మార్క్ దాటి 40,000 చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక గ్లోబల్ మార్కెట్స్ చూస్తే ఔన్స్ బంగారం ధర 1,489.07 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. మరోవైపు న్యూ ఢిల్లీలో కేజీ వెండి రూ.290 పెరిగింది. ఇక కేజీ వెండి ధర న్యూఢిల్లీలో రూ.46,560. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.48,100. అంతర్జాతీయంగా చూస్తే ఔన్స్ వెండి ధర 17.49 డాలర్లు.

తక్కువ ధరతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... రెడ్‌మీ 8 ఎలా ఉందో చూడండి





ఇవి కూడా చదవండి:

Dhanteras 2019: ధంతేరాస్‌కు నగలు కొనేవారు ఈ టిప్స్ ఫాలో అవండి

Gold Bond: మార్కెట్ రేట్ కన్నా తక్కువ ధరకే బంగారం... కొనండి ఇలా
Loading...
Reliance Jewels: రిల‌య‌న్స్ జ్యుయెల్స్‌ కొత్త స్టోర్ ప్రారంభం... క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్ ఆఫర్లివే
First published: October 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...