Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధర... అయినా రికార్డు ధర కన్నా రూ.11,000 తక్కువే

Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధర... అయినా రికార్డు ధర కన్నా రూ.11,000 తక్కువే (ప్రతీకాత్మక చిత్రం)

Gold Price Today | పండుగ సీజన్ సందర్భంగా బంగారం (Gold) కొనాలనుకుంటున్నారా? హైదరాబాద్‌లో లేటెస్ట్ గోల్డ్, సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

  • Share this:
    భారీగా పడిపోతున్న బంగారం ధరలు (Gold Price) స్వల్పంగా పెరుగుతున్నాయి. సోమవారంనాడు హైదరాబాద్ మార్కెట్‌లో గోల్డ్ ధర (Gold Rate) స్వల్పంగా పెరిగింది. శుక్రవారం నుంచి స్థిరంగానే ఉన్న గోల్డ్ రేట్స్ సోమవారం కాస్త పెరిగాయి. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ బంగారం ధర 10 గ్రాములపై రూ.150 పెరిగి రూ.43,200 నుంచి రూ.43,350 ధరకు చేరుకుంది. ఇక స్వచ్ఛమైన బంగారం అయిన 24 క్యారట్ గోల్డ్ ధర 10 గ్రాములపై రూ.160 పెరిగి రూ.47,130 నుంచి రూ.47,290 ధరకు చేరుకుంది. వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. కిలో వెండిపై రూ.600 పెరగడంతో ధర రూ.64,100 నుంచి రూ.64,700 ధరకు చేరుకుంది. కొంతకాలంగా బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బంగారం, వెండి ధర కొద్దిగా పెరిగింది.

    myAadhaar Portal: ఆధార్ కొత్త వెబ్‌సైట్‌లో లభించే 11 రకాల సేవలు ఇవే

    ధర కొద్దిగా పెరిగినా రికార్డు ధరలతో పోలిస్తే గోల్డ్, సిల్వర్ రేట్స్ చాలా తక్కువే ఉన్నాయి. స్వచ్ఛమైన బంగారం రికార్డు ధర నుంచి రూ.11,840 తక్కువకు, 22 క్యారట్ బంగారం రూ.10,850 తక్కువకు లభిస్తోంది. గతేడాది ఆగస్టులో బంగారం, వెండి ధరలు రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ మార్కెట్‌లో 2020 ఆగస్ట్ 7న 22 క్యారట్ బంగారం ధర రూ.54,200 కాగా ప్రస్తుతం రూ.43,200 ధర దగ్గర లభిస్తోంది.

    Postal Saving Scheme: ప్రతినెలా కొంత పొదుపు చేస్తే రూ. 16 లక్షలు మీవే... స్కీమ్ వివరాలు తెలుసుకోండి

    ఇక అదే రోజున స్వచ్ఛమైన బంగారం రూ.59,130 స్థాయికి చేరుకోగా ప్రస్తుతం రూ.47,290 దగ్గర లభిస్తోంది. ఈ లెక్కన రికార్డు ధరతో పోలిస్తే బంగారం రూ.11,000 తక్కువ ధరకే లభిస్తోంది. వెండి ధర కూడా రికార్డు స్థాయి నుంచి భారీగా తగ్గింది. 2020 ఆగస్ట్ 7న కిలో వెండి రూ.76,150 ధరకు చేరుకుంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.64,700. కిలో వెండి రూ.11,450 తక్కువకే లభిస్తోంది. భవిష్యత్తులో బంగారం ధర పెరుగుతుందా, తగ్గుతుందా అన్నది మార్కెట్ పరిస్థితులను బట్టి ఉంటుంది.

    ఇక మల్టీ కమాడిటీ ఎక్స్‌ఛేంజ్‌లో కూడా బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల గోల్డ్‌పై 0.20 శాతం అంటే రూ.93 పెరిగి రూ.46,088 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఎంసీఎక్స్‌లో కిలో వెండిపై 0.84 శాతం అంటే రూ.501 పెరిగి రూ.60,456 ధర దగ్గర ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1,750 డాలర్లు కాగా, ఔన్స్ సిల్వర్ ధర 22.61 డాలర్లు.
    Published by:Santhosh Kumar S
    First published: