Gold Price: మళ్లీ పెరిగిన బంగారం ధర... లేటెస్ట్ రేట్స్ ఇవే

Gold Price Today | స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో బంగారం ధర పెరిగిందని మార్కెట్ వర్గాల అంచనా.

news18-telugu
Updated: July 30, 2019, 5:31 PM IST
Gold Price: మళ్లీ పెరిగిన బంగారం ధర... లేటెస్ట్ రేట్స్ ఇవే
Gold Price: మళ్లీ పెరిగిన బంగారం ధర... లేటెస్ట్ రేట్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: July 30, 2019, 5:31 PM IST
బంగారం ధర ఊగిసలాడుతోంది. సోమవారం 10 గ్రాముల బంగారంపై రూ.50 తగ్గితే మంగళవారం రూ.160 పెరిగింది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం 10 గ్రాముల ధర రూ.35,880 కాగా, 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం ధర రూ.35,710. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ బంగారం ధర రూ.36,560 కాగా, 22 క్యారెట్ ధర రూ.33,350. సావరిన్ గోల్డ్ ధర స్థిరంగా కొనసాగుతోంది. 8 గ్రాముల సావరిన్ గోల్డ్ ధర రూ.27,500. స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో బంగారం ధర పెరిగిందని మార్కెట్ వర్గాల అంచనా. న్యూయార్క్‌లో ఔన్స్ బంగారం ధర 1,427.60 డాలర్లు.

మరోవైపు వెండి ధర కూడా పెరిగింది. కేజీ వెండిపై రూ.150 పెరిగింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి ధర రూ.42,050. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.44,835. న్యూయార్క్‌లో ఔన్స్ వెండి ధర 16.54 డాలర్లు. పరిశ్రమలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లు పెంచడంతో వెండి రేటు పెరిగింది. మార్కెట్‌లో 100 వెండి నాణేల ధర రూ.1,000 పెరిగింది. 100 వెండి నాణేల కొనుగోలు ధర రూ.85,000 కాగా అమ్మకం ధర రూ.86,000. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య చర్చలు ఉండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారు. దాంతో పాటు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ మీటింగ్‌పైనా దృష్టి పెట్టారు.

Realme 3i: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ 3ఐ ఎలా ఉందో చూశారా?




ఇవి కూడా చదవండి:

Post Office Scheme: ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా ఆదాయం

LIC Plan: రోజుకు రూ.29... రూ.2 లక్షల ఇన్స్యూరెన్స్... ఇంకెన్నో లాభాలు
Loading...
Credit Card: మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉందా? ఈ తప్పులతో తిప్పలే
First published: July 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...