బంగారం, వెండి ధరలు ఊగిసలాడుతున్నాయి. పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. గత మూడు రోజులుగా తగ్గుతున్నట్టు కనిపించిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. మంగళవారం గోల్డ్ రేట్ స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్‌లో బంగారం 10 గ్రాముల ధర రూ.160 పెరిగింది. ప్రస్తుతం 24 క్యారట్ ధర రూ.41,830 కాగా, 22 క్యారట్ ధర రూ.38,360. న్యూ ఢిల్లీలో స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.54 పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో బంగారం ధర రూ.40,807. మరోవైపు వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో కేజీ వెండిపై రూ.100 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.49,600. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.56 తగ్గింది. ప్రస్తుత ధర రూ.47,804. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 6 పైసలు తగ్గి 71.17 కి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,559 డాలర్లు, ఔన్స్ వెండి ధర 18 డాలర్లు. రూపాయి విలువ తగ్గడం, అంతర్జాతీయ కారణాల వల్ల బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
Gold: బంగారం ధర మార్కెట్ కన్నా రూ.4,000 తక్కువ... ఎలా కొనాలో తెలుసుకోండి
Save Money: రూ.1 కోటి కావాలంటే ఇలా పొదుపు చేయండి
Aadhaar Services: ఈ ఒక్క యాప్ ఉంటే... 35 ఆధార్ సేవలు పొందొచ్చుPublished by:Santhosh Kumar S
First published:January 21, 2020, 17:46 IST