బంగారం ధర రోజురోజుకీ పెరుగుతోంది. 10 గ్రాముల బంగారం ధర రూ.50,000 వైపు పరుగులు తీస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి రూ.55,000 ధరకు చేరుకోవచ్చని ఓ అంచనా. ఏదేమైనా గోల్డ్ రేట్ పరుగులు తీస్తూనే ఉంది. 2 రోజుల్లో బంగారం ధర రూ.1,500 పెరిగింది. కొత్త రికార్డులు సృష్టించింది. ఫ్యూచర్స్ మార్కెట్లో రూ.46,700 ధరను తాకింది. ఎంసీఎక్స్‌లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ ఏకంగా 1% పెరిగి రూ.46,785 ధరకు చేరుకుంది. అంతకుముందు సెషన్లో ఏకంగా 2% పెరిగి రూ.46,255 ధరకు చేరుకుంది.
కరోనా వైరస్ సంక్షోభం, ప్రపంచ మాంద్య పరిస్థితులు నెలకొనడంతో ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు. దీంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,727.59 డాలర్లు. ఎంసీఎక్స్‌లో కిలో వెండిపై 1.4% పెరిగి రూ.44,350 ధరకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి ధర 15.64 డాలర్లు. హైదరాబాద్‌లో బంగారం ధర 10 గ్రాములపై రూ.110 పెరిగింది. ప్రస్తుత ప్రస్తుతం 24 క్యారట్ ధర రూ.45,760 కాగా 22 క్యారట్ గోల్డ్ ధర రూ.41.960. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.41,850.
ఇవి కూడా చదవండి:
LIC: కరోనావైరస్ ఎఫెక్ట్... ఎల్ఐసీ తీసుకున్న కీలక నిర్ణయాలివే
PF Balance: పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేస్తున్నారా? ఎంత నష్టమంటే
Jan Dhan Yojana: జన్ ధన్ అకౌంట్లోకి డబ్బులు పంపిన కేంద్రం... బ్యాలెన్స్ చెక్ చేయండిలాPublished by:Santhosh Kumar S
First published:April 15, 2020, 17:57 IST