Home /News /business /

GOLD PRICE RISES RS 150 TO RS 47200 IN HYDERABAD KNOW LATEST GOLD AND SILVER RATES SS

Gold Rate Today: బంగారం ఇంకా కొనలేదా? ధర పెరిగిపోతోంది

Gold Rate Today: బంగారం ఇంకా కొనలేదా? ధర పెరిగిపోతోంది
(ప్రతీకాత్మక చిత్రం)

Gold Rate Today: బంగారం ఇంకా కొనలేదా? ధర పెరిగిపోతోంది (ప్రతీకాత్మక చిత్రం)

Gold Rate Today | హైదరాబాద్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగితే, వెండి రేటు భారీగా తగ్గింది. హైదరాబాద్‌లో లేటెస్ట్ గోల్డ్, సిల్వర్ రేట్స్ తెలుసుకోండి.

    పెళ్లిళ్లు, ఫంక్షన్లకు బంగారం కొనాలనుకొని ఇంకా కొనలేదా? ధర మరింత తగ్గుతుందేమోనని ఎదురుచూస్తున్నారా? గోల్డ్ రేట్ పెరిగిపోతోంది. నాలుగు రోజుల్లో బంగారం ధర రూ.500 పైనే తగ్గింది. లేటెస్ట్ రేట్స్ చూస్తే హైదరాబాద్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. స్వచ్ఛమైన బంగారంతో పాటు ఆభరణాల తయారీకి ఉపయోగించే బంగారం ధర కూడా స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లేటెస్ట్ గోల్డ్ రేట్స్ చూస్తే 22 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములపై రూ.150 పెరిగి రూ.47,200 ధరకు చేరుకుంది. ఇటీవల 22 క్యారట్ గోల్డ్ రేట్ రూ.46,700 వరకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇక స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములపై రూ.160 పెరిగి రూ.51,490 ధరకు చేరుకుంది. నాలుగు రోజుల క్రితం స్వచ్ఛమైన బంగారం ధర రూ.50,950 వరకు చేరుకుంది.

    LIC new plan: ఎల్ఐసీ నుంచి సరికొత్త పాలసీ... ఈ ప్లాన్‌తో ప్రతీ నెలా అకౌంట్‌లోకి డబ్బులు

    Jewel Utsav Diwali Sale: ఇంట్లో కూర్చొని మీకు నచ్చిన నగలు భారీ డిస్కౌంట్‌తో కొనండి

    హైదరాబాద్‌లో ఓవైపు బంగారం ధరలు పెరిగితే వెండి రేటు భారీగా పతనమైంది. కిలోవెండిపై ఏకంగా రూ.400 తగ్గి రూ.62,600 ధరకు చేరుకుంది. మల్టీ కమాడిటీ ఎక్స్‌ఛేంజ్‌లో గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ 10 గ్రాముల ధర 0.03 శాతం అంటే రూ.14 పెరిగి రూ.50,780 ధర దగ్గర ట్రేడ్ అవుతోంది. ఎంసీఎక్స్‌లో సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ కిలో ధర 0.25 శాతం అంటే రూ.155 తగ్గి రూ.62,460 ధర దగ్గర ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం 1,905.30 డాలర్లు కాగా ఔన్స్ సిల్వర్ ధర 24.67 డాలర్లు.

    SBI Home Loan: హోమ్ లోన్ కస్టమర్లకు బంపరాఫర్... వడ్డీ తగ్గించుకోండి ఇలా

    Saral Jeevan Bima: రూ.25 లక్షల ఇన్స్యూరెన్స్‌తో త్వరలో స్టాండర్డ్ టర్మ్ లైఫ్ పాలసీ... బెనిఫిట్స్ ఇవే

    ఆగస్ట్‌లో బంగారం ధర భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 7న 22క్యారట్ బంగారం 10 గ్రాముల ధర రూ.54,200 ధరకు, 24క్యారట్ బంగారం 10 గ్రాముల ధర రూ.59,130 ధరకు చేరుకుంది. ఆగస్ట్‌, సెప్టెంబర్ ధరలతో పోలిస్తే ఇప్పుడు గోల్డ్, సిల్వర్ రేట్స్ తక్కువగానే ఉన్నాయి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: BUSINESS NEWS, Gold, Gold bars, Gold jewellery, Gold ornmanets, Gold prices, Gold rate hyderabad, Gold rates, Gold shops, Personal Finance, Silver rates

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు