బంగారం వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములు రూ.47,000 ధరకు చేరువైంది. 24 క్యారట్ బంగారం 10 గ్రాములపై రూ.150 పెరిగి రూ.46,910 ధరకు చేరుకుంది. 22 క్యారట్ బంగారం రేటు రూ.120 పెరిగి రూ.44,150 ధరకు చేరుకుంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ.10 పెరిగి రూ.42,010 ధరకు చేరుకుంది. మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో కూడా గోల్డ్ జూన్ ఫ్యూచర్స్ 10 గ్రాములపై 0.23 శాతం అంటే రూ.104 పెరిగి రూ.45,475 ధరకు చేరుకుంది. సిల్వర్ జూలై ఫ్యూచర్స్ కిలో ధర 0.29 శాతం అంటే రూ.122 పెరిగి రూ.41,967 ధరకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ఔన్స్ బంగారం ధర 0.3% పెరిగి 1,690.19 డాలర్లకు చేరుకుంది. ఔన్స్ వెండి ధర కూడా 0.3% పెరిగి 14.96 డాలర్లకు చేరుకుంది.
ఇటీవల కాలంలో బంగారం ధరలు బాగా పెరిగిన సంగతి తెలిసిందే. గత నెలలో 10 గ్రాముల బంగారం ధర రూ.47,000 మార్క్‌ను దాటింది. బంగారం రేటు పెరుగుతున్నా డిమాండ్ మాత్రం తగ్గట్లేదు. గోల్డ్‌పైన ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్టర్లు మొగ్గుచూపుతున్నారు. గత నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI సావరిన్ గోల్డ్ బాండ్స్‌ని అమ్మితే రూ.822 కోట్లతో కొన్నారు ఇన్వెస్టర్లు. గతంలో సావరిన్ గోల్డ్ బాండ్ అమ్మకాలతో పోలిస్తే ఇది రికార్డే. గోల్డ్ రేట్ పెరిగినా డిమాండ్ తగ్గట్లేదనడానికి ఇది ఓ ఉదాహరణ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.