Gold Price: మళ్లీ పెరిగిన బంగారం ధర... లేటెస్ట్ రేట్స్ ఇవే

Gold Rate Today | స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడంతో బంగారం రేటు పెరుగుతోందని మార్కెట్ వర్గాల అంచనా.

news18-telugu
Updated: July 24, 2019, 5:25 PM IST
Gold Price: మళ్లీ పెరిగిన బంగారం ధర... లేటెస్ట్ రేట్స్ ఇవే
Gold Price: మళ్లీ పెరిగిన బంగారం ధర... లేటెస్ట్ రేట్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: July 24, 2019, 5:25 PM IST
బంగారం ధర మళ్లీ పెరిగింది. మంగళవారం బంగారం ధర రూ.250 తగ్గినా ఆ సంతోషం కొన్నిగంటలే. బుధవారం 10 గ్రాముల బంగారంపై రూ.150 పెరగడంతో రూ.35,870 ధరకు చేరుకుని రూ.36,000 వైపు పరుగులు తీస్తోంది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ సమాచారం ప్రకారం న్యూ ఢిల్లీలో 99.9% స్వచ్ఛత గల బంగారం 10 గ్రాముల ధర రూ.35,870 కాగా, 99.5% స్వచ్ఛత గల బంగారం ధర రూ.35,700. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ బంగారం ధర రూ.36,530 కాగా, 22 క్యారెట్ గోల్డ్ ధర రూ.33,340. ఇక 8 గ్రాముల సావరిన్ గోల్డ్ రూ.100 పెరిగి రూ.27,500 ధరకు చేరుకుంది. న్యూయార్క్‌లో ఔన్స్ బంగారం ధర 1,425.40 డాలర్లు.

పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఇన్వెస్టర్లు బంగారం వైపు పెట్టుబడులను మళ్లిస్తున్నారు. దాంతో పాటు స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడంతో బంగారం రేటు పెరుగుతోందని మార్కెట్ వర్గాల అంచనా. ఇక కిలో వెండి ధర రూ.350 పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.42,300. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఎక్కువవడంతో వెండి ధర పెరిగింది. 100 వెండినాణేల కొనుగోలు ధర రూ.85,000 కాగా అమ్మకం ధర రూ.86,000. న్యూయార్క్‌లో ఔన్స్ వెండి ధర 16.58 డాలర్లు.

Realme 3i: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ 3ఐ ఎలా ఉందో చూశారా?




ఇవి కూడా చదవండి:

Travel Insurance: టూర్ వెళ్తున్నారా? ట్రావెల్ ఇన్స్యూరెన్స్‌తో లాభాలివే...

Netflix: గుడ్ న్యూస్... రూ.199 ధరకే నెట్‌ఫ్లిక్స్ ప్లాన్
Loading...
IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి కేరళ, తమిళనాడు టూర్... ప్యాకేజీ వివరాలివే
First published: July 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...