Gold Price Today: పెరిగిన బంగారం ధర... లేటెస్ట్ రేట్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)
బంగారం ధర మళ్లీ పెరిగింది. ఇటీవల తగ్గుతున్నట్టు కనిపించిన గోల్డ్ రేట్ మళ్లీ పెరుగుతోంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారంపై రూ.140 పెరిగింది. ప్రస్తుతం 22 క్యారట్ బంగారం ధర రూ.43,750 కాగా, 24 క్యారట్ బంగారం ధర రూ.46,550. మరోవైపు వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. కిలో వెండిపై రూ.290 పెరిగి రూ.41,500 ధరకు చేరుకుంది. మరోవైపు మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్-MCX లో కూడా బంగారం ధర పెరిగింది. గత వారం వరుసగా నాలుగు రోజులు బంగారం ధర తగ్గిన సంగతి తెలిసిందే. కానీ గత రెండు సెషన్లలో గోల్డ్ రేట్ పెరుగుతోంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములపై 0.7% శాతం అంటే రూ.650 పెరిగి రూ.45,830 ధరకు చేరుకుంది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ కేజీపై 0.44% పెరిగి రూ.41,780 ధరకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఔన్స్ బంగారం ధర 0.3% పెరిగి 1,705.57 డాలర్లకు చేరుకుంది. ఔన్స్ వెండి ధర 14.85 డాలర్లు.
కరోనా వైరస్ సంక్షోభంలో బంగారం ధరలు హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నాయి. ఓ దశలో 10 గ్రాముల బంగారం రేటు రూ.50,000 వైపు దూసుకెళ్తుందని అనుకున్నారు. కానీ గత వారం గోల్డ్ రేట్ కాస్త తగ్గింది. ఏప్రిల్ మొదటి వారంలో 10 గ్రాముల గోల్డ్ రేట్ 47,000 మార్క్ దాటిన సంగతి తెలిసిందే. ఈక్విటీ మార్కెట్లు నష్టాలు ఇస్తుండటంతో ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు. అందుకే గోల్డ్ రేట్ గతంలో కన్నా ఎక్కువగానే ఉంది.
ఇవి కూడా చదవండి:
SBI Personal Loan: తక్కువ వడ్డీకే ఎస్బీఐలో పర్సనల్ లోన్... తీసుకోవచ్చు ఇలా
Jan Dhan account: నేటి నుంచి జన్ ధన్ అకౌంట్లోకి మనీ ట్రాన్స్ఫర్... చెక్ చేయండిలా
Personal Loans: గుడ్ న్యూస్... కస్టమర్లకు కోవిడ్ 19 లోన్స్ ఇస్తున్న బ్యాంకులు
Published by:
Santhosh Kumar S
First published:
May 4, 2020, 4:58 PM IST