బంగారం ధర మళ్లీ పెరిగింది. సోమవారం హైదరాబాద్‌లో బంగారం ధర తగ్గిన సంగతి తెలిసిందే. మంగళవారం ధర పెరిగింది. గత వారమే హైదరాబాద్‌లో స్వచ్ఛమైన బంగారం ధర రూ.47,000 మార్క్‌ను దాటింది. రూ.50,000 వైపు పరుగులు తీస్తోంది. ఇవాళ 10 గ్రాముల గోల్డ్‌పై రూ.110 పెరిగింది. ప్రస్తుతం 24 క్యారట్ బంగారం ధర రూ.47,410 కాగా, 22 క్యారట్ బంగారం ధర రూ.44,630. హైదరాబాద్‌లో వెండి ధర స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.43,090. మరోవైపు మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్-MCX లో గోల్డ్ రేట్ స్వల్పంగా పెరిగింది. గోల్డ్ జూన్ ఫ్యూచర్స్ 10 గ్రాములు రూ.45,787 దగ్గర ట్రేడ్ అవుతోంది. సిల్వర్ జూలై ఫ్యూచర్స్ రూ.43,190 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1701 డాలర్లు కాగా, ఔన్స్ వెండి ధర 15.50 డాలర్లు.
మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI సావరిన్ గోల్డ్ బాండ్స్‌ని అమ్ముతోంది. ఒక గ్రాము ధరను రూ.4,590 అని ఫిక్స్ చేసింది ఆర్బీఐ. మే 15 వరకు గోల్డ్ బాండ్స్ కొనొచ్చు. సావరిన్ గోల్డ్ బాండ్స్‌కి సంబంధించిన పూర్తి వివరాల కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి:
Prepaid Plans: జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ బెస్ట్ ప్లాన్స్ ఎంచుకోండి ఇలా
SBI: బ్యాంకులో డిపాజిట్స్ ఉన్నవారికి ఎస్బీఐ షాక్... నేటి నుంచి కొత్త రేట్లు
SBI: బ్యాంకులో డిపాజిట్స్ ఉన్నవారికి ఎస్బీఐ షాక్... నేటి నుంచి కొత్త రేట్లుPublished by:Santhosh Kumar S
First published:May 12, 2020, 18:01 IST