Gold Price Today: భారీగా పతనమైన బంగారం ధర... తులం రేటు ఎంతంటే

Gold Price Today: భారీగా పతనమైన బంగారం ధర... తులం రేటు ఎంతంటే (ప్రతీకాత్మక చిత్రం)

Gold Rate Today | పసిడిప్రియులకు గుడ్ న్యూస్. హైదరాబాద్‌లో బంగారం ధర భారీగా తగ్గుతోంది. ఇవాళ్టి బంగారం, వెండి ధరలు తెలుసుకోండి.

  • Share this:
    బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. గోల్డ్ రేట్ భారీగా తగ్గింది. హైదరాబాద్‌లో 10 గ్రాములపై ఏకంగా రూ.1,050 ధర తగ్గింది. ప్రస్తుతం 24 క్యారట్ బంగారం ధర రూ.41,920 కాగా, 22 క్యారట్ బంగారం ధర రూ.38,340. న్యూ ఢిల్లీలో మాత్రం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల బంగారంపై రూ.31 పెరగడంతో రూ.40,718 ధరకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌ల ఔన్స్ బంగారం ధర 1,482 డాలర్లు. మరోవైపు వెండి ధర కూడా పతనమవుతోంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.40,000 దిగువకు చేరింది. కిలో వెండిపై రూ.1,790 తగ్గడంతో రూ.39,990 ధరకు చేరుకుంది. అటు న్యూ ఢిల్లీలోనూ వెండి ధర రూ.190 తగ్గి రూ.35,444 ధరకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ వెండి ధర 11.97 డాలర్లు. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ దారుణంగా పతనమైంది. తొలిసారి 75 మార్క్‌ను తాకింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా ఉండటం వల్ల గోల్డ్ రేట్ పెరిగినట్టు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

    ఇవి కూడా చదవండి:

    Pan Card: పాన్ కార్డ్ కావాలా? 10 నిమిషాల్లో ఫ్రీగా తీసుకోండి ఇలా

    Arogya Sanjeevani: సామాన్యుల కోసం సరికొత్త హెల్త్ ఇన్స్యూరెన్స్... ఏప్రిల్ 1న ప్రారంభం

    Post Office Account: పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ ఉందా? ఈ రూల్స్ మారాయి
    Published by:Santhosh Kumar S
    First published: