వరుసగా మూడు రోజులు పెరిగి ఆ తర్వాత ఓ రోజు తగ్గిన గోల్డ్ రేట్ ఇంకా తగ్గుతుందేమో అనుకున్నారు. కానీ ఆ ఆశలు అడియాశలే అయ్యాయి. శుక్రవారం గోల్డ్ రేట్ మళ్లీ షాకిచ్చింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్‌పై ఏకంగా రూ.1,000 పైనే పెరిగింది. దీంతో బంగారం ధర రూ.46,000 మార్క్ దాటి రూ.50,000 వైపు పరుగులు తీస్తోంది. హైదరాబాద్‌లో 24 క్యారట్ గోల్డ్‌పై రూ.1,020 పెరిగి రూ.46,160 ధరకు చేరుకుంది. 22 క్యారట్ గోల్డ్ ధర రూ.950 పెరిగి రూ.42,310 ధరకు చేరుకుంది. న్యూ ఢిల్లీలోనూ బంగారం ధర భారీగానే పెరిగింది. 10 గ్రాముల గోల్డ్‌పై రూ.773 పెరగడంతో రూ.45,343 ధరకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,678 డాలర్లు.
గోల్డ్ రేట్‌తో పాటు వెండి ధర కూడా పరుగులు తీసింది. హైదరాబాద్‌లో కేజీ వెండి రేటు రూ.51,000 మార్క్ దాటింది. కేజీపై ఏకంగా రూ.1,230 పెరిగి రూ.51,080 ధరకు చేరుకుంది. న్యూ ఢిల్లీలో కేజీ వెండిపై రూ.192 పెరిగి రూ.48,180 ధరకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి ధర 17.34 డాలర్లు. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 23 పైసలు బలహీనపడింది. రూపాయి బలహీనపడటం బంగారం ధరలు పెరగడానికి ఒక కారణమైతే, వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ ఆర్థిక వ్యవస్థల్ని కుప్పకూలుస్తుండటంతో ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించడం మరో కారణం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.