హోమ్ /వార్తలు /బిజినెస్ /

Gold Price: రెండు రోజుల్లో రూ.1,000 పెరిగిన బంగారం... తులం ఎంతంటే

Gold Price: రెండు రోజుల్లో రూ.1,000 పెరిగిన బంగారం... తులం ఎంతంటే

Gold Price: రెండు రోజుల్లో రూ.1,000 పెరిగిన బంగారం... తులం ఎంతంటే
(ప్రతీకాత్మక చిత్రం)

Gold Price: రెండు రోజుల్లో రూ.1,000 పెరిగిన బంగారం... తులం ఎంతంటే (ప్రతీకాత్మక చిత్రం)

Gold Rate Today | బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు తెలుసుకోండి.

బంగారం ధర మళ్లీ దూసుకెళ్తోంది. 10 గ్రాముల ధర రెండు రోజుల్లో రూ.1,000 పెరిగింది. ఎంసీఎక్స్‌లో జూన్ ఫ్యూచర్స్ ధర 0.53 శాతం పెరిగి రూ.46,413 ధరకు చేరుకుంది. కొద్ది రోజుల క్రితం 10 గ్రాముల ధర రూ.47,327 ధరను తాకిన సంగతి తెలిసిందే. దీంతో బంగారం రూ.50,000 ధరకు చేరుకుంటుందని అంతా భావించారు. కానీ ఆ తర్వాత గోల్డ్ రేట్ భారీగా తగ్గింది. ఏకంగా రూ.2,000 పైనే తగ్గింది. బంగారం ధర దిగొస్తుందని అనుకుంటూ ఉండగానే మళ్లీ గోల్డ్ రేట్ పెరిగింది. రెండు రోజుల్లో రూ.1,000 ధర పెరగడం పసిడి ప్రేమికులకు షాకిచ్చింది. మరోవైపు ఎంసీఎక్స్‌లో కిలో వెండి రేటు 1.2% పెరిగి రూ.42,210 ధరకు చేరుకుంది. ప్రపంచ మార్కెట్‌లో బంగారం ధర అస్థిరంగా ఉండటంతో భారతదేశంలోనూ గోల్ట్ రేట్స్ ఇలాగే పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1,710 డాలర్లు కాగా, ఔన్స్ వెండి ధర 15 డాలర్లు.

ఇక హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం 24 క్యారట్ బంగారం ధర రూ.44,790 కాగా, 22 క్యారట్ బంగారం ధర రూ.41,060. కిలో వెండి ధర రూ.41,420. ఏప్రిల్ 26న అక్షయ తృతీయ ఉంది. సాధారణంగా అక్షయ తృతీయకు ముందే జ్యువెలర్ షాపుల్లో సందడి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈసారి కరోనా వైరస్ లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో షాపులన్నీ మూతపడ్డాయి. కొన్ని నగల దుకాణాలు ఆన్‌లైన్‌లో బంగారాన్ని అమ్ముతున్నాయి.

ఇవి కూడా చదవండి:

Akshay Tritiya 2020: ఆన్‌లైన్‌లో బంగారంపై అక్షయ తృతీయ ఆఫర్స్ ఇవే

Gold: బంగారు నగలు కొనేవారు ఈ టిప్స్ ఫాలో అవండి

Online Gold: ఆన్‌లైన్‌లో బంగారు నగలు కొనొచ్చా? తెలుసుకోండి

EPF: రూ.15,000 లోపు జీతం ఉన్నవారికి త్వరలో గుడ్ న్యూస్?

First published:

Tags: BUSINESS NEWS, Gold, Gold bars, Gold jewellery, Gold ornmanets, Gold prices, Gold rate hyderabad, Gold rates, Gold shops, Silver rates

ఉత్తమ కథలు