HOME »NEWS »BUSINESS »gold price rises rs 100 to rs 43900 in hyderabad know latest gold and silver prices ss

Gold price today: మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్... తులం బంగారం ఎంతంటే

Gold price today: మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్... తులం బంగారం ఎంతంటే
Gold price today: మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్... తులం బంగారం ఎంతంటే (ప్రతీకాత్మక చిత్రం)

Gold Rate Today | బంగారం ధర మళ్లీ పెరిగింది. హైదరాబాద్‌లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు తెలుసుకోండి.

  • Share this:
    బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగాయి. హైదరాబాద్‌లో బుధవారం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.360 తగ్గిన సంగతి తెలిసిందే. గోల్డ్ రేట్ ఇంకా తగ్గుతుందని పసిడిప్రేమికులు భావించారు. కానీ ఒక్కరోజులోనే ఆశలు ఆవిరయ్యాయి. గురువారం బంగారం ధర మళ్లీ పెరిగింది. హైదరాబాద్‌లో 22 క్యారట్ గోల్డ్ 10 గ్రాములపై రూ.110 పెరిగి రూ.40,140 ధరకు చేరుకుంది. 24 క్యారట్ బంగారంపై రూ.100 పెరిగి రూ.43,900 ధరకు చేరుకుంది. వెండి ధర స్వల్పంగా పెరిగింది. కేజీ వెండిపై రూ.40 పెరిగి రూ.40,990 ధరకు చేరుకుంది.

    ఇక ఎంసీఎక్స్ ఎక్స్‌ఛేంజ్‌లో ఫ్యూచర్స్ మార్కెట్‌లో బంగారం ధర 45,000 దాటింది. 10 గ్రాములపై రూ.173 పెరిగి రూ.45,114 ధరకు చేరుకుంది. ఆగస్ట్ డెలివరీ రూ.152 పెరిగి రూ.45,280 ధరకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1,700.90 డాలర్లు. అంతర్జాతీయ ట్రెండ్స్ పాజిటీవ్‌గా ఉండటం వల్లే బంగారం ధర పెరిగిందని అంచనా వేస్తున్నారు. ఎంసీఎక్స్ ఎక్స్‌ఛేంజ్‌లో వెండి ధర స్వల్పంగా పెరిగింది. కిలో వెండిపై రూ.91 పెరిగి రూ.43,230 ధరకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ వెండి ధర 15.44 డాలర్లు.



    ఇవి కూడా చదవండి:

    Insurance Policy: ఎల్ఐసీతోపాటు ఇతర పాలసీహోల్డర్లకు గుడ్ న్యూస్

    Savings Account: ఏ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్‌తో ఎక్కువ లాభం... తెలుసుకోండి

    Personal Loan: పర్సనల్‌ లోన్ తీసుకుంటున్నారా? ఈ టిప్స్ మీకోసమే...
    Published by:Santhosh Kumar S
    First published:April 09, 2020, 17:44 IST