Gold Price: మళ్లీ పెరిగిన బంగారం ధర... లేటెస్ట్ రేట్స్ తెలుసుకోండి

Gold Price today | అంతర్జాతీయ ట్రెండ్స్ స్థిరంగా ఉండటం, నగల వ్యాపారుల నుంచి డిమాండ్ వల్ల బంగారం ధర స్వల్పంగా పెరిగింది.

news18-telugu
Updated: July 16, 2019, 6:30 PM IST
Gold Price: మళ్లీ పెరిగిన బంగారం ధర... లేటెస్ట్ రేట్స్ తెలుసుకోండి
Gold Price: మళ్లీ పెరిగిన బంగారం ధర... లేటెస్ట్ రేట్స్ తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గితే మంగళవారం అంతే ధర పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం రూ.35,570 ధరకు చేరుకుంది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ సమాచారం ప్రకారం ప్రస్తుతం న్యూ ఢిల్లీలో 99.9% స్వచ్ఛత గల బంగారం 10 గ్రాముల ధర రూ.35,570 కాగా, 99.5% స్వచ్ఛతగల బంగారం ధర రూ.35,400. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.36,090 కాగా, 22 క్యారెట్ బంగారం ధర రూ.33,120. విదేశ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1,415.80 డాలర్లు. 8 గ్రాముల సావరిన్ గోల్డ్ ధర రూ.27,400. అంతర్జాతీయ ట్రెండ్స్ స్థిరంగా ఉండటం, నగల వ్యాపారుల నుంచి డిమాండ్ వల్ల బంగారం ధర స్వల్పంగా పెరిగింది. మరోవైపు కిలో వెండి ధర ఏకంగా రూ.355 పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.39,530. పరిశ్రమలు, నాణేల తయారీదారులు కొనుగోలు ఎక్కువగా ఉండటం వల్ల వెండి ధర పెరిగింది. 100 వెండి నాణేల కొనుగోలు ధర రూ.81,000 కాగా, అమ్మకం ధర రూ.82,000. అంతర్జాతీయంగా చూస్తే ఔన్స్ వెండి ధర 15.50 డాలర్లు.

Realme 3i: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ 3ఐ ఎలా ఉందో చూశారా?



ఇవి కూడా చదవండి:



IRCTC: వైజాగ్ నుంచి రాజస్తాన్ టూర్... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే

e-PAN Card: కేవలం 10 నిమిషాల లోపు ఇ-పాన్ కార్డ్ జారీ

మొదటిసారి ఫ్లైట్ ఎక్కుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
First published: July 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>