Gold Price Today: మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు... ఇవాళ్టి రేట్స్ ఇవే

Gold Rate Today | హైదరాబాద్‌లో బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఓవైపు గోల్డ్ రేట్ పెరుగుతుంటే వెండి ధరలు తగ్గుతున్నాయి. హైదరాబాద్‌లో లేటెస్ట్ గోల్డ్, సిల్వర్ రేట్స్ తెలుసుకోండి.

news18-telugu
Updated: March 3, 2020, 5:39 PM IST
Gold Price Today: మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు... ఇవాళ్టి రేట్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. సోమవారం న్యూ ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.391 పెరిగిన సంగతి తెలిసిందే. మంగళవారం కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారట్ గోల్డ్ ధర రూ.40,000 మార్క్‌ను దాటింది. మంగళవారం ధర రూ.160 పెరిగింది. 24 క్యారట్ గోల్డ్ ధర రూ.10 మాత్రమే పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారట్ బంగారం ధర రూ.40,140 కాగా, 24 క్యారట్ గోల్డ్ ధర రూ.43,790. న్యూ ఢిల్లీలో మంగళవారం బంగారం ధర చాలా స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల గోల్డ్‌పై రూ.6 పెరగడంతో ధర రూ.42,958 దగ్గర ఆగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1,595 డాలర్లు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 24 పైసలు బలహీనపడటం వల్లే బంగారం ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ విశ్లేషకుల అంచనా. దాంతో పాటు యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు, ప్రధాన బ్యాంకుల నుంచి ద్రవ్య విధానం సడలింపుపై అంచనాలు పెరగడం కూడా బంగారం ధరలు తగ్గడానికి కారణమని విశ్లేషిస్తున్నారు.

ఓవైపు బంగారం ధరలు పెరుగుతుంటే వెండి ధర తగ్గడం విశేషం. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.50 తగ్గింది. ప్రస్తుత ధర రూ.48,700. న్యూ ఢిల్లీలో కేజీ వెండిపై రూ.58 తగ్గి రూ.46,213 ధరకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ వెండి ధర 16.76 డాలర్లు.

ఇవి కూడా చదవండి:

Gold: బంగారు నగలు కొనేవారు ఈ టిప్స్ ఫాలో అవండి

Online Gold: ఆన్‌లైన్‌లో బంగారు నగలు కొనొచ్చా? తెలుసుకోండి

IRCTC Golden Chariot: మార్చి 22న లగ్జరీ టూరిస్ట్ రైలు ప్రారంభం... రూట్, ప్యాకేజీ వివరాలివే
First published: March 3, 2020, 5:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading