బంగారం ధర మళ్లీ స్వల్పంగా పెరిగింది. బంగారం ధర పెరగడం వరుసగా ఇది నాలుగో రోజు. ధర భారీగా కాకుండా స్వల్పంగానే పెరుగుతోంది. మంగళవారం దేశరాజధానిలో 10 గ్రాముల బంగారంపై రూ.11 పెరిగితే, గురువారం రూ.8 పెరిగింది. దీంతో న్యూ ఢిల్లీలో 10 గ్రాముల బంగారం రూ.38,828 ధరకు చేరుకుంది. ఇక హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.70 పెరిగింది. ప్రస్తుత ధరలు చూస్తే 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ.39,620 కాగా, 22 క్యారెట్ గోల్డ్ ధర రూ.36,320. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,476.90 డాలర్లు.
ఇక వెండిధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. కేజీ వెండిపై రూ.14 పెరగడంతో రూ.45,649 ధరకు చేరుకుంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.50 పెరిగింది. దీంతో కిలో వెండి రూ.46850 ధరకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి ధర 17.01 డాలర్లు. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 10 పైసలు బలహీనపడింది. మరోవైపు పౌడర్ రూపంలో బంగారం, వెండి దిగుమతి చేయడంపై ఆంక్షలు విధించింది భారత ప్రభుత్వం. అయితే పౌడర్ రూపంలో బంగారం, వెండిని పారిశ్రామిక అవసరాల కోసం దిగుమతి చేసుకుంటారని పరిశ్రమ వర్గాల వాదన.
Realme X2: రియల్మీ ఎక్స్2 రిలీజ్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Gold: బంగారు నగలు కొనేవారు ఈ టిప్స్ ఫాలో అవండి
Nokia 2.3: అదిరిపోయే ఫీచర్స్‌తో వచ్చేసిన నోకియా 2.3 స్మార్ట్‌ఫోన్... ధర రూ.8,199
PAN-Aadhaar Link Status: మీ ఆధార్ నెంబర్ పాన్ కార్డుతో లింకైందా? 30 సెకన్లలో తెలుసుకోండి ఇలాPublished by:Santhosh Kumar S
First published:December 18, 2019, 17:56 IST