GOLD PRICE RISES AGAIN KNOW LATEST GOLD AND SILVER RATES IN HYDERABAD SS
Gold Price Today: బంగారం కొనాలనుకునేవారికి షాక్... భారీగా పెరిగిన గోల్డ్ రేట్
Gold Price Today: బంగారం కొనాలనుకునేవారికి షాక్... భారీగా పెరిగిన గోల్డ్ రేట్
(ప్రతీకాత్మక చిత్రం)
Gold Rate Today | బంగారం ధర మళ్లీ పెరుగుతోంది. స్వచ్ఛమైన గోల్డ్ రేట్ ధర రూ.45,000 వైపు దూసుకెళ్తోంది. హైదరాబాద్‌లో లేటెస్ట్ గోల్డ్, సిల్వర్ రేట్స్ తెలుసుకోండి.
బంగారం ధర పెరుగుతుందా, తగ్గుతుందా అన్నది అంచనాలకు అందట్లేదు. కొద్ది రోజుల క్రితం తగ్గుతున్నట్టు అనిపించిన గోల్డ్ రేట్ మళ్లీ పెరుగుతోంది. బంగారం ధర భారీగా పెరుగుతుండటం కొనుగోలుదారులకు షాక్ ఇస్తోంది. ముంబై బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1,528 పెరిగింది. ప్రస్తుతం ముంబైలో 10 గ్రాముల 22 క్యారట్ బంగారం ధర రూ.38,698 కాగా, 24 క్యారట్ గోల్డ్ ధర రూ.42,247. ఇక 18 క్యారట్ గోల్డ్ ధర రూ.31,685. హైదరాబాద్‌లో కూడా గోల్డ్ రేట్ పెరుగుతోంది. 10 గ్రాములపై రూ.300 పైనే పెరిగింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం 24 క్యారట్ బంగారం ధర రూ.43,620 కాగా, 24 క్యారట్ గోల్డ్ ధర రూ.40,073.
బంగారం మాత్రమే కాదు... వెండి ధర కూడా దూసుకెళ్తోంది. కేజీ వెండి ధర రూ.40,000 దాటింది. ముంబై బులియన్ మార్కెట్లో కేజీ వెండి ధర ఏకంగా రూ.3,475 పెరిగి రూ.40,325 ధరకు చేరుకుంది. హైదరాబాద్‌లో కేజీ వెండిపై రూ.1,140 పెరిగింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.41,020. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ భారీగా ట్రెజరీస్, సెక్యూరిటీస్ కొనాలని నిర్ణయించడంతో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నట్టు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దాంతో పాటు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ దారుణంగా పతనం కావడం కూడా బంగారం, వెండి రేట్లు పెరగడానికి కారణమని భావిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.