Gold Rate: పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold Rate Today | ప్రస్తుతం ఢిల్లీలో 99.9 స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.33,330 కాగా 99.5 స్వచ్ఛత గల బంగారం ధర రూ.33,160. ఇక 8 గ్రాముల సావరిన్ గోల్డ్ ధర రూ.26,500.

news18-telugu
Updated: May 16, 2019, 4:42 PM IST
Gold Rate: పెరిగిన బంగారం, వెండి ధరలు
Gold Rate: తగ్గిన బంగారం, వెండి ధరలు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
బంగారం ధర స్వల్పంగా పెరిగింది. దేశరాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.70 పెరిగింది. కేజీ వెండి ధర కూడా రూ.50 పెరిగింది. నగల వ్యాపారులు బంగారం ఎక్కువగా కొనడంతో ధర పెరిగినట్టు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. దేశీయంగా డిమాండ్ ఎక్కువగా ఉండటం కూడా బంగారం ధర పెరగడానికి కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక పరిశ్రమలు, నాణేల తయారీ దారులు కూడా ఎక్కువగా కొనడం వల్ల వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. అంతర్జాతీయంగా చూస్తే బంగారం ధరలో పెద్దగా మార్పు లేదు. ఔన్సు బంగారం ధర 1,295.70 డాలర్లు కాగా, వెండి ధర 14.85 డాలర్లు.

Read this: బంగారం కొనేముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ప్రస్తుతం ఢిల్లీలో 99.9 స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.33,330 కాగా 99.5 స్వచ్ఛత గల బంగారం ధర రూ.33,160. ఇక 8 గ్రాముల సావరిన్ గోల్డ్ ధర రూ.26,500. వెండి ధర కేజీకి రూ.50 పెరగడంతో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.38,250. ఇక 100 వెండి నాణేల కొనుగోలు ధర రూ.80,000, అమ్మకం ధర రూ.81,000.

OnePlus 7 Series: అదిరిపోయిన వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్స్


ఇవి కూడా చదవండి:

Gym Business: జిమ్‌ బిజినెస్‌తో లక్షల్లో సంపాదన... ఎలాగో తెలుసుకోండిCredit Card: క్రెడిట్ కార్డ్ కావాలా? ఈ టిప్స్ మీకోసమే...

SSY Scheme: రోజుకు రూ.100 పొదుపుతో రూ.16 లక్షల రిటర్న్స్...
Published by: Santhosh Kumar S
First published: May 16, 2019, 4:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading