Gold Price: రూ.305 పెరిగిన బంగారం ధర

Gold Price Today | ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.32,690 కాగా 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం ధర రూ.32,530.

news18-telugu
Updated: April 19, 2019, 4:13 PM IST
Gold Price: రూ.305 పెరిగిన బంగారం ధర
Gold Price: రూ.305 పెరిగిన బంగారం ధర (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: April 19, 2019, 4:13 PM IST
బంగారం ధర తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగింది. గురువారం ఒక్క రోజే బంగారం ధర రూ.405 తగ్గింది. దీంతో బంగారం కొనాలనుకునేవాళ్లు కాస్త సంబరపడ్డారు. కానీ శుక్రవారం వచ్చేసరికి గోల్డ్ రేట్ పెరిగింది. ఏకంగా 10 గ్రాముల బంగారంపై రూ.305 ధర పెరిగింది. న్యూ ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.305 పెరిగి రూ.32,690 ధరకు చేరుకుందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకటించింది. నగల వ్యాపారులు, రీటైలర్లు బంగారం కొనేందుకు ఆసక్తి చూపించడంతో ధర పెరిగిందని మార్కెట్‌ వర్గాల అంచనా.

Read this: Post Office Franchise: రూ.5 వేలతో పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్... వివరాలు ఇవే...

గుడ్ ఫ్రైడే కావడంతో అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌కు శుక్రవారం హాలిడే. ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.32,690 కాగా 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం ధర రూ.32,530. సావరిన్ గోల్డ్ రూ.100 తగ్గింది. సావరిన్ గోల్డ్ 8 గ్రాములు రూ.100 పెరిగి రూ.26,400 ధరకు చేరుకుంది. ఇక వెండి ధర కూడా రూ.204 పెరిగింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులు కాస్త ఎక్కువగా కొనడంతో వెండి ధర పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.38,450.

Good Friday 2019: గుడ్‌ఫ్రైడే నాడు స్ఫూర్తినిచ్చే 10 కొటేషన్స్



ఇవి కూడా చదవండి:

SBI Loan: ఎస్‌బీఐలో ఎడ్యుకేషన్ లోన్... ఇలా తీసుకోవచ్చు
Loading...
NIOS Jobs: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్‌లో 90 ఉద్యోగాలు

SBI Card: ఎస్‌బీఐ కార్డు ఉంటే ఉచితంగా ఇన్స్యూరెన్స్... వివరాలివే
First published: April 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...