Gold Price: స్వల్పంగా పెరిగిన బంగారం ధర, తగ్గిన వెండి ధర

Gold Price Today | 99.9% స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.32,870 కాగా, 99.5% స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.32,700.

news18-telugu
Updated: April 22, 2019, 6:30 PM IST
Gold Price: స్వల్పంగా పెరిగిన బంగారం ధర, తగ్గిన వెండి ధర
Gold Price: స్వల్పంగా పెరిగిన బంగారం ధర, తగ్గిన వెండి ధర
  • Share this:
బంగారం ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం రోజున 10 గ్రాముల బంగారం ధర రూ.200 పెరిగింది. న్యూ ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.32,870. స్థానిక నగల వ్యాపారుల్లో డిమాండ్ పెరగడం, అంతర్జాతీయంగా సానుకూల అంశాలు తోడవడంతో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 99.9% స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.32,870 కాగా, 99.5% స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.32,700. సావరిన్ గోల్డ్ ధర ఎనిమిది గ్రాములకు రూ.26,400. అంతర్జాతీయంగా చూస్తే ఔన్సు బంగారం ధర 1,279.50 డాలర్లు.

మరోవైపు వెండి ధర స్వల్పంగా తగ్గింది. కేజీ వెండిపై రూ.30 తగ్గింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.38,570. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోలు తగ్గించడంతో వెండి రేటు తగ్గింది. 100 వెండి నాణేలను రూ.80 వేలకు కొని రూ.81 వేలకు అమ్ముతున్నాయి మార్కెట్ వర్గాలు.

Realme 3 Pro: రిలీజైన రియల్‌మీ 3 ప్రో... ఎలా ఉందో చూశారా?

ఇవి కూడా చదవండి:

IRCTC-ePayLater: డబ్బులు లేవా? అయినా ట్రైన్ టికెట్ బుక్ చేయొచ్చు ఇలా...

Minimum Balance: బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్‌ లెక్కించేది ఇలాగే...Air India Jobs: ఎయిర్ ఇండియాలో క్లర్క్, ఎగ్జిక్యూటీవ్ పోస్టులు
First published: April 22, 2019, 6:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading