హోమ్ /వార్తలు /బిజినెస్ /

Gold Silver Rates: భారీ షాక్.. రూ.2,000 పెరిగిన బంగారం ధర.. జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న గోల్డ్!

Gold Silver Rates: భారీ షాక్.. రూ.2,000 పెరిగిన బంగారం ధర.. జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న గోల్డ్!

 భారీ షాక్.. రూ.2,000 పెరిగిన బంగారం ధర.. జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న గోల్డ్ రేటు!

భారీ షాక్.. రూ.2,000 పెరిగిన బంగారం ధర.. జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న గోల్డ్ రేటు!

Gold Rate Today | బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి చేదు వార్త. పసిడి రేటు పెరుగుతూనే వస్తోంది. కేవలం వారం వ్యవధిలోనే పసిడి రేటు ఏకంగా రూ. 2 వేలకు పైగా పరుగులు పెట్టింది. దీపావళి నాటికి బంగారం ధర మరింత పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

    Gold Price Today | బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీరు ఇప్పుడే ఆ పని పూర్తి చేసుకోవడం ఉత్తమం. ఎందుకని అనుకుంటున్నారా? పసిడి రేటు పరుగులు పెడుతోంది. పుత్తడి జిగేల్ మంటూ దూసుకుపోతోంది. వారం రోజుల వ్యవధిలోనే గోల్డ్ రేటు భారీగా పెరిగింది. అంతేకాకుండా రానున్న రోజుల్లో పసిడి రేటు మరింత పైకి చేరొచ్చని, దీపావళి నాటికి మళ్లీ కొండెక్కొచ్చని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

    అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ర్యాలీ చేస్తోంది. ఈ ప్రభావంతో దేశీ మార్కెట్‌లో కూడా పసిడి రేటు పైపైకి కదులుతూ వస్తోంది. అమెరికా డాలర్ బలహీనపడటం, బాండ్ ఈల్డ్స్ దిగి రావడం వంటి అంశాల కారణంగా బంగారం ధర దూకుడు పెంచిందని నిపుణులు పేర్కొంటున్నారు. దీని వల్ల బంగారం రేట్లు పైపైకి చేరుతున్నాయి.

    ఎస్‌బీఐ శుభవార్త.. రూ.40 వేల భారీ తగ్గింపు!

    గ్లోబల్ మార్కెట్‌లో ఇటీవల కాలంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఏకంగా ఔన్స్‌కు 1629 డాలర్లకు కూడా దిగివచ్చాయి. అయితే పసిడి రేటు మళ్లీ పైపైకి కదిలింది. ఇప్పుడు బంగారం ధర ఔన్స్‌కు 1721 డాలర్ల వద్ద కొనసాగుతోంది. దీంతో దేశీ మార్కెట్‌లో బంగారం ధరలు కూడా అదే స్థాయిలో ర్యాలీ చేస్తూ వస్తున్నాయి. గత వారం రోజుల్లో చూస్తే బంగారం ధర ఏకంగా 10 గ్రాములకు రూ.2 వేలకు పైగా పెరిగింది.

    హోమ్, కారు, గోల్డ్ లోన్స్‌పై అదిరే ఆఫర్లు అందిస్తున్న బ్యాంక్

    సెప్టెంబర్ 28న రూ. 49,970 వద్ద ఉన్న పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఇప్పుడు అంటే అక్టోబర్ 5న రూ. 52,100కు చేరింది. అంటే పసిడి రేటు రూ. 2 వేలకు పైగా పెరిగిందని చెప్పుకోవచ్చు. పండుగ సీజన్‌లో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. పండుగ సీజన్, పెళ్లిళ్ల సీజన్ కారణంగా కూడా బంగారం ధర పైకి చేరుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో వచ్చే దీపావళి పండుగ నాటికి బంగారం ధరలు మరింత పెరగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం కొనాలని భావించే వారికి, లేదంటే బంగారంలో ఇన్వెస్ట్‌ చేయాలని యోచించే వారికి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఆర్థిక మాంద్యం భయాలు నానాటికీ పెరిగిపోతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. వచ్చే ఏడాది కల్లా బంగారం ధర పది గ్రాములకు రూ. 60 వేలకు చేరొచ్చని మరి కొంత మంది నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా బంగారాన్ని సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్ సాధనంగా భావిస్తారు.

    Published by:Khalimastanvali Khalimastanvali
    First published:

    Tags: Gold price, Gold Price Today, Gold rate, Gold Rate Today, Today gold rate in hyderabad

    ఉత్తమ కథలు