హోమ్ /వార్తలు /బిజినెస్ /

Today Gold Rate: రానున్న రోజుల్లో బంగారం ధర తగ్గుతుందా? పెరుగుతుందా? ఈ రోజు రేట్లు ఇవే!

Today Gold Rate: రానున్న రోజుల్లో బంగారం ధర తగ్గుతుందా? పెరుగుతుందా? ఈ రోజు రేట్లు ఇవే!

Credit Card: క్రెడిట్ కార్డుతో బంగారం కొంటున్నారా? ఈ విషయం తెలుసుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)

Credit Card: క్రెడిట్ కార్డుతో బంగారం కొంటున్నారా? ఈ విషయం తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

Gold price | బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. పసిడి రేటు పైపైకి చేరింది. ఆరు వారాల గరిష్టానికి ఎగసింది. బంగారం ధర పెరుగుదలకు ఏ ఏ అంశాలు దోహపడుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Gold Rate | బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. పసిడి రేటు (Gold) పైపైకి చేరుతూ వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఆరు వారాల కనిష్ట స్థాయి నుంచి పైకి చేరింది. ప్రస్తుతం పసిడి రేటు ఔన్స్‌కు 1716 డాలర్ల వద్ద ఉంది. అమెరికా డాలర్ పడిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (Bank) కీలక పాలసీ రేటును 75 బేసిస్ పాయింట్ల మేర పెంచడంతో డాలర్‌పై ఒత్తిడి నెలకొంది. ఇది బంగారానికి కలిసొచ్చే అంశం అని చెప్పుకోవచ్చు. ఇటీవల 110.78 స్థాయికి చేరిన అమెరికా డాలర్ ఇప్పుడు 108.94 వద్ద కదలాడుతోంది.

  దేశీ మార్కెట్‌లో కూడా గోల్డ్ ఫ్యూచర్స్ ధర మూడు వారాల తగ్గుదలకు బ్రేక్ వేస్తూ పైకి చేరింది. పసిడి రేటు శుక్రవారం రాత్రి 10 గ్రాములకు రూ. 165 పెరుగుదలతో రూ. 50,521 స్థాయికి చేరింది. కమొడిటీ మార్కెట్ నిపుణుల ప్రకారం చూస్తే.. స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్‌కు 1680 డాలర్ల నుంచి 1755 డాలర్ల శ్రేణిలో కదలాడవచ్చని తెలుస్తోంది. అదే ఎంసీఎక్స్ మార్కెట్‌లో అయితే బంగారం ధర పది గ్రాములకు రూ.49,800 నుంచి రూ. 51,200 స్థాయిలో కదలాడవచ్చు.

  Bank అకౌంట్ ఉన్న వారికి అలర్ట్.. ఈ 7 రకాల సర్వీసులకు డబ్బులు చెల్లించాల్సిందే!

  ఈసీబీ వడ్డీ రేటును పెంచడం వల్ల డాలర్‌పై ఒత్తిడి కొనసాగవచ్చని, అందువల్ల సమీప కాలంలో బంగారం ధరలు పైకి చేరే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అందువల్ల బంగారంలో ఇన్వెస్ట్ చేసే వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. పసిడి రేటు తగ్గినప్పుడు అల్లా కొనుగోలు చేయడం ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు.

  ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వాడుతున్నారా? రోజుకు ఎంత డబ్బు పంపొచ్చొ తెలుసుకోండి

  రెలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ (కమొడిటీ అండ్ కరెన్సీ రీసెర్చ్) సుగంధ సచ్‌దేవ్ మాట్లాడుతూ.. బంగారం ధరలు మూడు వారాల తగ్గుదల నుంచి బయటకు వచ్చాయని, ఇప్పుడు కీలక మద్దతు స్థాయి వద్ద ఉన్నాయని వివరించారు. ఇతర దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా ఇదే దారిలో పయనించే అవకాశం ఉందన్నారు. మరోవైపు కోవిడ్ 19 ఆంక్షలు చైనాలో అమలులో ఉన్నాయని గుర్తు చేశారు. ఇంకా ఆర్థిక మాంద్యం భయాల వద్ద క్రూడ్ ధరలు కూడా 7 నెలల కనిష్టానికి తగ్గాయన్నారు. ఇవ్వనీ బంగారం ధరకు సానుకూల అంశాలని తెలియజేశారు. అందువల్ల రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి. పసిడి కొనుగోలు చేయాలని భావించే వారు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Gold, Gold price, Gold rate hyderabad, Gold Rate Today, Silver price

  ఉత్తమ కథలు