Gold Price Today | బంగారం కొనాలని భావిస్తున్నారా? అయితే ఇప్పుడే కొనుగోలు చేయడం ఉత్తమం. ఎందుకంటే బంగారం ధరలు ఈ నెలలో భారీగా పెరగనున్నాయి. మళ్లీ కొండెక్కబోతున్నాయి. అందువల్ల మీరు ఇప్పుడే పసిడిని కొనుగోలు చేయడం ఉత్తమం అని చెప్పుకోవచ్చు. డిసెంబర్ నెలలో బంగారం ధరలు (Gold Prices) ఈ వారంలో ఏప్రిల్ నుంచి చూస్తే గరిష్ట స్థాయికి చేరాయి. గ్లోబల్ మార్కెట్లో చూస్తే.. పసిడి రేటు (Gold Rates) ఔన్స్‌కు 1800 డాలర్లకు ఎగసింది. గత నెలలో గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఒక్కసారి ర్యాలీ చేసింది. ఫెడరల్ రిజర్వు ఫెడ్ రేటు పెంపు వేగం తగ్గొచ్చనే అంచనాలు ఇందుకు ప్రధాన కారణం.
డిసెంబర్ నెలలో చూస్తే.. బంగారం ధర పది గ్రాములకు రూ. 54 వేల మార్క్ పైకి చేరొచ్చని ఐసీఐసీఐ డైరెక్ట్ అంచనా వేస్తోంది. బంగారంలో ఇప్పుడు బలమైన బుల్లిష్ ట్రెండ్ కొనసాగుతోందని తెలియజేసింది. ద్రవ్యోల్బణం దిగి వస్తోందని, అందువల్ల కేంద్ర బ్యాంకులు కీలక రేట్లను తక్కువగా పెంచొచ్చని అంచనా వేస్తోంది. దీని వల్ల డాలర్ పరుగుకు బ్రేకులు పడతాయని పేర్కొంది. దీంతో బంగారం ధరలు ర్యాలీ చేయొచ్చని పేర్కొంది.
పీఎం జ్ఞానవీర్ స్కీమ్‌లో చేరితే ప్రతి నెలా ఉచితంగా రూ.3,400? కేంద్రం ఏమంటోందంటే?
శుక్రవారం రోజున ఎంసీఎక్స్ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ. 53,880 వద్ద క్లోజ్ అయ్యింది. సిల్వర్ ఫ్యూచర్స్ ధర రూ. 1.59 శాతం పెరిగింది. రూ. 66,450 వద్ద ముగిసింది. ఐసీఐసీఐ డైరెక్ట్ ప్రకారం చూస్తే.. కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర గత నెలలో ఒక్కసారి పైకి కదిలింది. గత ఏడు నెలల్లో చూస్తే తొలిసారి పరుగులు పెట్టింది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో బుల్లిష్ ట్రెండ్ ప్రారంభం అయ్యింది.
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ కాకపోతే ఫ్లైట్ టికెట్ ఫ్రీ!
ద్రవ్యోల్బణం 8 శాతం దిగువకు పడిపోవడంతో అమెరికా ఫెడరల్ రిజర్వు రానున్న కాలంలో రేటు పెంపును తగ్గించొచ్చని ఇన్వెస్టర్లు అంచనా వేస్తున్నారు. ఇకపోతే నవంబర్ నెలలో అమెరికా పదేళ్ల బాండ్ ఈల్డ్ 3.7 శాతం వద్ద ఉంది. అక్టోబర్ నెలలో ఇది 4.25 శాతానికి చేరిన విషయం తెలిసిందే. బాండ్ ఈల్డ్ తగ్గడం వల్ల బంగారం ధరలు ర్యాలీ చేస్తున్నాయి. కాగా అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వు డిసెంబర్ నెలలో ఫెడ్ రేటును మరో 50 బేసిస్ పాయింట్లు పెంచొచ్చనే అంచనాలు ఉన్నాయి.
ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు డిసెంబర్ నెరలలో రూ. 52,200 నుంచి రూ. 54,200 స్థాయిలో కదలాడవచ్చని ఐసీఐసీఐ డైరెక్ట్ అంచనా వేసింది. అలాగే గ్లోబల్ మార్కెట్లో అయితే పసిడి రేటు 1842 డాలర్ల స్థాయికి చేరొచ్చని పేర్కొంటోంది. బంగారం ధరకు 1620 డాలర్ల వద్ద బలమైన మద్దతు ఉందని తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gold price, Gold Price Today, Gold rate, Gold Rate Today, Silver price, Silver rate