• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • GOLD PRICE MAY HIT RS 50000 TO 55000 IN 2020 SAYS EXPERTS SS

Gold price: బంగారం ధర రూ.55,000 చేరే అవకాశం... ఎందుకంటే

Gold price: బంగారం ధర రూ.55,000 చేరే అవకాశం... ఎందుకంటే

Gold price: బంగారం ధర రూ.55,000 చేరే అవకాశం... ఎందుకంటే (ప్రతీకాత్మక చిత్రం)

Gold Price | మరో రెండుమూడేళ్లు బంగారం ధరలు ఇలాగే పెరుగుతుంటాయని భావిస్తున్నారు. ఇందుకు కారణం ప్రస్తుత ఆర్థిక పరిస్థితులే.

  • Share this:
    పసిడి ప్రియులకు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. బంగారం ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. మంగళవారం గోల్డ్ రేట్ ఏడేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇవాళ ఔన్స్ బంగారం ధర 1715 డాలర్లు దాటింది. ఏడేళ్ల క్రితం 2012 డిసెంబర్‌లో ఔన్స్ బంగారం 1722 డాలర్లు దాటి రికార్డులు సృష్టించింది. ఇప్పుడు మరోసారి ఆ రికార్డును తాకింది. భారతదేశంలో 10 గ్రాముల గోల్డ్ ధర రూ.46,000 మార్క్ దాటి రూ.50,000 వైపు పరుగులు తీస్తోంది. ఈ పరుగు ఇప్పట్లో ఆగే పరిస్థితి కనిపించట్లేదు. బంగారం ధర ఈ ఏడాది చివరి నాటికి రూ.55,000 చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు విశ్లేషకులు. 2019 లో బంగారం 23.74 శాతం రిటర్న్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 2020 లో కూడా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. 2020 లో ఇప్పటి వరకు బంగారం ధర 17.31 శాతం అంటే రూ.6,794 పెరిగింది. ఇదే ట్రెండ్ కొనసాగితే బంగారం ధర ఈ ఏడాది రూ.55,000 చేరే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.

    ఈ ఏడాదిలో ఔన్స్ బంగారం ధర 1800 డాలర్లకు చేరుకోవచ్చు. అంటే 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.50,000 నుంచి రూ.55,000 మధ్య ట్రేడ్ కావచ్చు. బంగారాన్ని కొనాలనుకునేవారు సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్-SIP పద్ధతిలో కొనడం మంచిది.
    మనీకంట్రోల్‌తో డాక్టర్ సౌరభ్ గాడ్గిల్, మేనేజింగ్ డైరెక్టర్, పీఎన్‌జీ జ్యువెలర్స్


    అంతేకాదు... మరో రెండుమూడేళ్లు బంగారం ధరలు ఇలాగే పెరుగుతుంటాయని భావిస్తున్నారు. ఇందుకు కారణం ప్రస్తుత ఆర్థిక పరిస్థితులే. ఇన్వెస్టర్లలో భయం పెరిగిపోవడం, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొనడంతో ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు. ప్రస్తుతం భారతీయ రీటైల్ ఇన్వెస్టర్లు 10 నుంచి 15 శాతం గోల్డ్‌ని హోల్డ్ చేస్తున్నారు. రెండేళ్లలో ఇది 30 శాతానికి చేరొచ్చని అంచనా.

    ఇవి కూడా చదవండి:

    Credit Card: డబ్బులు లేవా? క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టండి ఇలా

    Good News: ఈ స్కీమ్స్‌లో సేవింగ్స్ చేస్తున్నవారికి గుడ్ న్యూస్

    Personal Loan: పర్సనల్‌ లోన్ తీసుకుంటున్నారా? ఈ టిప్స్ మీకోసమే...



    Aadhaar Services: ఈ 7 ఆధార్ సేవల్ని ఇంటి నుంచే పొందొచ్చు
    Published by:Santhosh Kumar S
    First published: