Gold Rate: అరలక్ష దాటేసిన తులం బంగారం...పసిడి ప్రియులకు చేదువార్త...

(ప్రతీకాత్మక చిత్రం)

24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 170 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 50 వేల రూపాయల మార్కును దాటి 50,560 రూపాయల వద్ద నిలిచింది. ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి.

  • Share this:
    బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఈరోజు (జూన్ 25) దేశీయంగా పెరుగుదల నమోదు చేశాయి. మరో వైపు వెండి ధరలు స్వల్ప తగ్గుదల నమోదు చేసింది. హైదరాబాద్ లో గురువారం (25.06.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు 250 రూపాయలు పెరిగింది. దీంతో 46,350 రూపాయల వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 170 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 50 వేల రూపాయల మార్కును దాటి 50,560 రూపాయల వద్ద నిలిచింది. ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 250 రూపాయలు పెరిగింది. దీంతో 46,350 రూపాయల వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 170 రూపాయల పేరుదల నమోదు చేసింది. దీంతో 50 వేల రూపాయల మార్కును దాటి 50,560 రూపాయల వద్ద నిలిచింది.

    బంగారం ధరలు పెరిగితే, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. కేజీ వెండి ధర బుధవారం నాటి ధరల కంటే 50 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 48వేల మార్కు దాటి ఎగసింది. కేజీ వెండి ధర 48,450 రూపాయలకు చేరుకుంది.
    First published: