బంగారం ధర భగ్గుమంటోంది. రోజురోజుకీ పరుగులు తీస్తోంది. కొత్త రికార్డులు సృష్టిస్తోంది. 10 గ్రాముల బంగారం ధర మొదటిసారి రూ.47,000 దాటింది. గోల్డ్ రేట్ రూ.50,000 వైపు పరుగులు తీస్తోంది. ఎంసీఎక్స్ జూమ్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములు రూ.47,095 ధరతో రికార్డ్ సృష్టించింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,717.20 డాలర్లు. ఎంసీఎక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ ధర 0.2 శాతం పెరిగి కేజీకి రూ.44,120 ధర పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి ధర 0.6% తగ్గి 15.38 డాలర్లకు చేరుకుంది. ఇక హైదరాబాద్‌లో బంగారం ధరలు చూస్తే 24 క్యారట్ గోల్డ్ రేట్ 10 గ్రాములపై రూ.210 పెరిగింది. ప్రస్తుత ధర రూ.45,970. ఇక 22 క్యారట్ గోల్డ్ ధర రూ.140 పెరిగింది. ప్రస్తుత ధర రూ.42,100. హైదరాబాద్‌లో వెండి ధర స్వల్పంగా పెరిగింది. కేజీ వెండిపై రూ.40 పెరిగి రూ.41,890 ధరకు చేరుకుంది.
కరోనా వైరస్ భయాలు పెరిగిపోతుండటం, స్టాక్ మార్కెట్లు కోలుకోకపోవడంతో ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు. దీంతో గోల్డ్ ధర అంతకంతకూ పెరిగిపోతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఇంకొన్ని రోజుల్లోనే 10 గ్రాముల బంగారం ధర రూ.50,000 దాటుతుంది. ఈ ఏడాదిలోనే బంగారం ధర రూ.55,000 చేరొచ్చని అంచనా.
ఇవి కూడా చదవండి:
Moratorium: 3 ఈఎంఐలు వాయిదా వేస్తే ఇంకా ఎక్కువ ఈఎంఐలు కట్టాలి
Prepaid Plans: రూ.200 లోపు జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ప్లాన్స్ ఇవే
EPF Claim: ఈపీఎఫ్ విత్‌డ్రాలో సమస్యలున్నాయా? ఇలా చేయండిPublished by:Santhosh Kumar S
First published:April 16, 2020, 17:43 IST