Gold Price: పసిడి ప్రేమికులకు షాక్... రూ.50,000 వైపు పరుగులు తీస్తున్న బంగారం

Gold rate today | బంగారం దర మళ్లీ దూసుకెళ్తోంది. హైదరాబాద్‌లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

news18-telugu
Updated: April 13, 2020, 10:35 AM IST
Gold Price: పసిడి ప్రేమికులకు షాక్... రూ.50,000 వైపు పరుగులు తీస్తున్న బంగారం
Gold Price: పసిడి ప్రేమికులకు షాక్... రూ.50,000 వైపు పరుగులు తీస్తున్న బంగారం (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
బంగారం కొనాలనుకునేవారికి షాకింగ్ న్యూస్. కొంతకాలం క్రితం తగ్గినట్టు కనిపించిన బంగారం ధర దూసుకెళ్తోంది. మరోసారి రికార్డ్ ధరను తాకింది గోల్డ్ రేట్. సోమవారం బంగారం ధర భారీగా పెరిగింది. రూ.46,000 మార్క్‌ను సమీపించింది. ట్రెండ్ ఇలాగే కొనసాగితే 10 గ్రాముల బంగారం ధర రూ.50,000 మార్క్ చేరుకోవడానికి ఎక్కువ రోజులు పట్టేలా లేదు. సోమవారం ఫ్యూచర్స్ మార్కెట్‌లో బంగారం ధర కొత్త రికార్డులు సృష్టించింది. ఎంసీఎక్స్‌లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ 1 శాతం పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.45,800 ధర పలికింది. బంగారం అంతకుముందు రూ.45,294 ధర దగ్గర ముగిసిన సంగతి తెలిసిందే. కానీ సోమవారం ఒక్కసారిగా రేటు భారీగా పెరిగింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం 24 క్యారట్ బంగారం ధర రూ.44,110 కాగా, 22 క్యారట్ గోల్డ్ ధర రూ.40,440. కిలో వెండి ధర రూ.41,150.

గ్లోబల్ మార్కెట్‌లో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ వైపు మొగ్గు చూపారు ఇన్వెస్టర్లు. గత వారం ఒక నెల గరిష్ట స్థాయికి బంగారం ధర చేరుకున్న సంగతి తెలిసిందే. కానీ ఇన్వెస్టర్లు అమ్మకాలపై దృష్టిపెట్టడంతో గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ రేట్ పడిపోయింది. ఔన్స్ బంగారం ధర 0.4 శాతం పడిపోయి 1,681.49 డాలర్లకు చేరుకుంది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్‌లో కూడా ఔన్స్ బంగారం ధర 1.4 శాతం పడిపోయి 1,728.40 డాలర్లకు చేరుకుంది.

ఇవి కూడా చదవండి:

LIC: కరోనావైరస్ ఎఫెక్ట్... ఎల్ఐసీ నుంచి 5 కీలక ప్రకటనలు

Credit Card: క్రెడిట్ కార్డ్ బిల్లు వాయిదా వేస్తున్నారా? ఈ నష్టం తప్పదు

Prepaid Plans: రోజుకు 3 జీబీ డేటా... జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ప్లాన్స్ ఇవే
First published: April 13, 2020, 10:35 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading